CM Sidda Ramaiah : కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మ
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:31 AM
‘నోటీసులకు భయపడను.. తప్పు చేసి ఉంటే కదా వెనుకాడాల్సింది..? వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య
బెంగళూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ‘నోటీసులకు భయపడను.. తప్పు చేసి ఉంటే కదా వెనుకాడాల్సింది..? వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.
మైసూరు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (ముడా) అవినీతి ఆరోపణలపై గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత తొలిసారిగా సీఎం శుక్రవారం స్పందించారు. గవర్నర్ కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారారని విమర్శించారు. జేడీఎస్, బీజేపీ నాయకుల చేతిలోనూ ఆయన కీలుబొమ్మేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 136 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రిని అయ్యానని, ముడా వ్యవహారంలో తన భాగస్వామ్యం లేకున్నా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.