Share News

CM Stalin: మళ్లీ అధికారమే లక్ష్యం.. 200కు పైగా స్థానాల్లో విజయం

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:25 AM

రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తుపెట్టుకుని ఏడేళ్లుదాటినా తమ కూటమి చెక్కుచెదరకుండా కొనసాగుతోందని కామ్రేడ్‌ నల్లకన్నులాంటి కమ్యూనిస్టు దిగ్గజాలు తనకు అండగా ఉన్నందున రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ధీమా వ్యక్తం చేశారు.

CM Stalin: మళ్లీ అధికారమే లక్ష్యం.. 200కు పైగా స్థానాల్లో విజయం

- కామ్రేడ్‌ నల్లకన్ను శతవసంత వేడుకల్లో స్టాలిన్‌ ధీమా

చెన్నై: రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తుపెట్టుకుని ఏడేళ్లుదాటినా తమ కూటమి చెక్కుచెదరకుండా కొనసాగుతోందని కామ్రేడ్‌ నల్లకన్నులాంటి కమ్యూనిస్టు దిగ్గజాలు తనకు అండగా ఉన్నందున రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ధీమా వ్యక్తం చేశారు. టి.నగర్‌ బాలన్‌ఇల్లమ్‌లోని సీపీఐ కమిటీ కార్యాలయంలో గురువారం సీనియర్‌ కమ్యూనిస్టునేత ఇరా నల్లకన్ను శతవసంత వేడుకల్లో పాల్గొని ఆయనను సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.

ఈ వార్తను కూడా చదవండి: ‘రంబుల్‌’.. పెయిన్‌ఫుల్‌.. స్ట్రిప్స్‌ ఏర్పాటుపై జనం ఆగ్రహం


ఆ సందర్భంగా ఏర్పాటైన సభలో స్టాలిన్‌ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత నల్లకన్ను వందో జన్మదిన వేడుకల్లో పాల్గొనటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. వయోవృద్ధులైన నల్లకన్నుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు రాలేదని, ఆయన ఆశీస్సులు పొందేదుకే వచ్చానని చెప్పారు. నల్లకన్ను జన్మదినవేడుకలను పళయ నెడుమారన్‌ నాయకత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29న కలైవానర్‌ అరంగంలో నిర్వహించనుందని, ఆ వేడుకల్లో రాష్ట్రంలోని రాజకీయ నేతలందరూ పాల్గొనేలా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా సభలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలిపారు.


ఆ జన్మదినవేడుకలకు శ్రీకారంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు తాను నల్లకన్ను ఆశీస్సులందుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా నల్లకన్ను జన్మదిన వేడుకలకు డీఎంకే కూటమిలోని రాజకీయపార్టీల నేతలంతా హాజరవుతున్నామని, ఈ ఐకమత్యం ఇలాగే కొనసాగుతుందని స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. సోషలిజాన్ని జీవితపర్యంతమూ నొక్కి వక్కాణిస్తున్న సీనియర్‌ కమ్యూనిస్టు దిగ్గజం నల్లకన్ను ద్రవిడ తరహా పాలనకు మద్దతిస్తూ అండగా నిలిచారని కొనియాడారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ముత్తురసన్‌ మాట్లాడుతూ రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200 సీట్లు సులువుగా గెలుచుకుంటుందని ప్రకటించారని, ప్రస్తుతం కూటమిలోని మిత్రపక్షాల మధ్య ఉన్న ఐకమత్యం చూస్తుంటే 200కు పైగా సీట్లను గెలుచుకుంటుందనే నమ్మకం తనకు కలుగుతోందన్నారు.


ఈ జన్మదినవేడుకల్లో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఎంపీలు టీఆర్‌ బాలు, తమిళచ్చి తంగపాండ్యన్‌, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో శాసనసభ్యులు రామచంద్రన్‌, అబ్దుల్‌సమద్‌, సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ముత్తరసన్‌, సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి కే బాలకృష్ణన్‌, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు టీకే రంగరాజన్‌, సీపం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు జి రామకృష్ణన్‌, సీపీఐ రాష్ట్ర కమిటీ డిప్యూటీ కార్యదర్శులు వీరపాండ్యన్‌, పెరియసామి, ఆమ్‌ఆద్మీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వశీకరన్‌, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అధ్యక్షుడు పూచ్చి ఎస్‌ మురుగన్‌ తదితరులు పాల్గొన్నారు.


శ్రీవైకుంఠం ఆస్పత్రి భవనానికి నల్లకన్ను పేరు...

ఇదిలా ఉండగా సీనియర్‌ కమ్యూనిస్టు నేత నల్లకన్ను శతవసంత వేడుకలను పురస్కరించుకుని ఆయన జన్మస్థలమైన శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పని సీటీస్కాన్‌ తదితర సాంకేతిక సదుపాయాలు సమకూర్చి స్థాయి పెంచనున్నామని, అదే విధంగా ఆ ప్రాంతంలో కొత్తగా నిర్మించే ఆస్పత్రి భవనానికి ఆయన పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. 15 యేళ్ల ప్రాయంలోనే రాజకీయాల్లో ప్రవేశించి 85 సంవత్సరాలుగా నల్లకన్ను చేస్తున్న ప్రజాసేవలను భావితరాలవారు గుర్తుంచుకునేలా శ్రీవైకుంఠంలో కొత్త నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి ‘కామ్రేడ్‌ నల్లకన్ను శతవసంత భవనం’ అనే పేరు పెట్టాలని ఆయన ఆదేశించారు.


ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్‌

ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2024 | 10:25 AM