Lok Sabha Elections: ఎన్నికల ప్రచారంలో యోగి... తొలి ర్యాలీ ఎక్కడినుంచంటే?
ABN , Publish Date - Mar 23 , 2024 | 05:36 PM
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి ఆయన సారథ్యం వహించనున్నారు. హోలీ వేడుకలు ముగిసిన వెంటనే మధుర నుంచి ప్రచారం ప్రారంభించి, పార్టీ శ్రేణులను ఉత్తేజపరచనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttara Pradesh)లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి ఆయన సారథ్యం వహించనున్నారు. హోలీ వేడుకలు ముగిసిన వెంటనే మధుర (Mathura) నుంచి ప్రచారం ప్రారంభించి, పార్టీ శ్రేణులను ఉత్తేజపరచనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
యోగి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ప్రకారం మార్చి 27న ప్రారంభమయ్యే ప్రబుద్ధ వర్గ సమ్మేళనానికి యోగి నాయకత్వం వహిస్తారు. ఎన్నికల వ్యూహాన్ని పార్టీ శ్రేణులకు వివరిస్తారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో రోజుకు మూడు చొప్పున సమ్మేళనాలు జరుపనున్నారు. మార్చి 27న మీరట్, ఘజియాబాద్‌లను సందర్శిస్తారు. 28న బిజ్నోర్, మెరాదాబ్ద్, అమ్రోహాలో సమావేశాలు జరుగుతాయి. 29న షామ్లీ, ముజఫర్ నగర్, షహరాన్‌పూర్, 30న బాగ్‌పత్, బులంద్‌షహర్, గౌతమ్ బుద్ధ నగర్, 31న బరేలీ, రాంపూర్, పిలిబిత్‌లలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తారు. దీంతో తొలి విడత ప్రచారం ముగుస్తుంది.