Lok Sabha Elections 2024: కాంగ్రెస్ మునిగిపోతున్న నౌక, ఏ శక్తీ కాపాడలేదు..
ABN , Publish Date - Apr 30 , 2024 | 05:06 PM
కాంగ్రెస్‌ను 'మునిగిపోతున్న నౌక' తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోల్చారు. నౌకకు అడుగున చిల్లు పడిందని, అది మునిగిపోకుండా ప్రపంచంలోని ఏ శక్తీ కాపాడలేదని జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, బద్వానీ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖాండ్వా: కాంగ్రెస్‌ను 'మునిగిపోతున్న నౌక' (Sinking Ship)తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పోల్చారు. నౌకకు అడుగున చిల్లు పడిందని, అది మునిగిపోకుండా ప్రపంచంలోని ఏ శక్తీ కాపాడలేదని జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఖాండ్వా, బద్వానీ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహాత్మా గాంధీ ఆరోజే చెప్పారు..
గాంధీ కుటుంబంపై రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పిస్తూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడినందున కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మాగాంధీ చెప్పారని, అయితే ఆయన అభ్యర్థనను కాంగ్రెస్ పెడచెవిన పెట్టిందని అన్నారు. మహాత్మాగాంధీ ఏదైతే చెప్పారో దానిని పరిపూర్ణం చేసేందుకు దేశ ప్రజలు ఇప్పుడు స్థిరనిశ్చయంతో ఉన్నారని, కచ్చితంగా దేశంలో కాంగ్రెస్ అనేది లేకుండా చేస్తారని అన్నారు.
Lok Sabha Elections: 'ప్రేమ దుకాణం'లో నకిలీ వీడియోల అమ్మకం.. కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు
పేదరిక నిర్మూలనలో మోదీదే పైచేయి..
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి నేతలంతా పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పిన వాళ్లేనని, అయితే ఆ పని చేయడంలో వాళ్లు విఫలమయ్యారని రాజ్‌నాథ్ అన్నారు. మోదీ ప్రభుత్వం పదేళ్లలో సమర్ధవంతంగా 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారని తెలిపారు
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా?
సూరత్, ఇండోర్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిదంటూ విపక్షం ఆరోపిస్తోందని, కాంగ్రెస్ అభ్యర్థులు గతంలో ఏకక్రీగవంగా 20 సార్లు గెలిచారని గుర్తుచేశారు. సూరత్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచారని, ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి పార్టీకి రాజీనామా చేసి బీజేపీకి మద్దతిచ్చారని తెలిపారు. బీజేపీ పట్ల ప్రజలకున్న ప్రేమ అటువంటిదని చెప్పారు. కాంగ్రెస్ మాత్రం బీజేపీతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అటోందని, గతంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా 20 సార్లు నెగ్గినప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందా? అని రాజ్‌నాథ్ ప్రశ్నించారు. కాగా, మధ్యప్రదేశ్‌లో నాలుగు విడతలుగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి రెండు దశలు ఏప్రిల్ 19, 26 తేదీల్లో జరిగాయి. మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలు ఉండగా, 2019లో బీజేపీ 28 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక సీటు దక్కిచుకుంది.
Read Latest National News and Telugu News