Amit Shah: నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది: అమిత్‌షా
ABN , Publish Date - Dec 18 , 2024 | 06:40 PM
కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ వ్యతిరేకి అని, రిజర్వేషన్లు, రాజ్యాంగానికి వ్యతిరేకమని అమిత్‌షా విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన ప్రత్యేక చర్చలో బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. కాంగ్రెస్ వక్రీకరణలను తాను ఖండిస్తున్నట్టు బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ వ్యతిరేకి అని, రిజర్వేషన్లు, రాజ్యాంగానికి వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు. వీరసావర్కర్‌ను అవమానించినదీ, ఎమర్జెన్సీ విధించినదీ కాంగ్రెస్ పార్టీయేనని, రాజ్యాంగ విలువలన్నింటినీ వాళ్లు కాలరాసారని అన్నారు.
Privilege Notice: ముసుగు తొలగింది.. అమిత్‌షాపై టీఎంసీ ప్రివిలిజ్ నోటీస్
''నా మాటలను వాళ్లు వక్రీకరించారు. ఇంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను సైతం ఎడిట్ చేశారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు నా స్టేట్‌మెంట్లను ఎడిట్ చేశారు. ఈరోజు సైతం నా ప్రకటనను వక్రీకరిస్తూ ముందుకొచ్చారు. నేను మాట్లాడిన పూర్తి స్టేట్‌మెంట్‌ను పబ్లిక్ ముందుకు తీసుకురావాలని మీడియాను కోరుతున్నాను. అంబేద్కర్‌ను ఎన్నడూ విమర్శించన పార్టీకి చెందిన వాడిని నేను. తొలుత జనసంఘ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అంబేద్కర్ సిద్ధాంతాల వ్యాప్తి చేస్తూనే వచ్చాం. రిజర్వేషన్ల పటిష్టతకు బీజేపీ పాటుపడింది. ఈ విషయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కూడా చెప్పదలచుకున్నాను. ఆయన రాహుల్ గాంధీ ఒత్తిడిలో చిక్కుకున్నారు" అని అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్ పార్టీనే బీఅర్ అంబేడ్కర్‌కు 'భారత రత్న' ఇవ్వకుండా, లోక్‌సభ ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమికి చేయాల్సినదంతా చేసిందని ఆరోపించారు
ఇవి కూడా చదవండి..
Jammu and Kashmir: ఊపిరందక ఆరుగురి మృతి.. నలుగురికి తీవ్రగాయాలు
Rahul Gandhi:ఆల్‌టైం హైకి వాణిజ్య లోటు.. కేంద్రంపై రాహుల్ ఫైర్
For National News And Telugu News