Share News

Adhir Ranjan Chowdhury: దేశంలో నీగ్రో, మంగోలాయిడ్‌ ప్రజలు!

ABN , Publish Date - May 10 , 2024 | 04:19 AM

‘దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారు’ అంటూ కీలకమైన ఎన్నికల సమయంలో శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఉంటే..

Adhir Ranjan Chowdhury: దేశంలో నీగ్రో, మంగోలాయిడ్‌ ప్రజలు!

  • కాంగ్రె్‌సనేత అధీర్‌ రంజన్‌ చౌధురి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 9: ‘దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారు’ అంటూ కీలకమైన ఎన్నికల సమయంలో శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఉంటే.. ఆ పార్టీకే చెందిన మరో సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురి.. పిట్రోడా వ్యాఖ్యలను సమర్థించేలా మాట్లాడి మరోసారి బీజేపీ నేతల విమర్శలకు ఆస్కారమిచ్చారు. శామ్‌పిట్రోడా వ్యాఖ్యలపై ఆయన స్పందన కోరగా.. ‘‘ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలపైనా నేనేమీ మాట్లాడదల్చుకోలేదు. మనదేశంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్‌, నెగ్రిటా (నీగ్రో), మంగోలాయిడ్‌ జాతులకు చెందినవారున్నారు.


మనదేశ నైసర్గిక స్వరూపం (టోపోగ్రఫీ) కారణంగా దేశంలో ఒక్కోచోట ఒక్కో రూపురేఖలున్నవారు ఉంటారు. ఇదే మనం నేర్చుకున్నది. అందరూ ఒకలా ఉండరు. కొంతమంది నల్లగా.. కొంతమంది తెల్లగా ఉంటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అధీర్‌ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా మండిపడ్డారు. ‘‘ఒక్క శామ్‌పిట్రోడాయే కాదు.. మొత్తం కాంగ్రెస్‌ నేతలందరూ జాతివివక్ష వ్యాఖ్య లు చేస్తారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అధీర్‌ను పార్టీ నుంచి కాంగ్రెస్‌ బహిస్కరిస్తుందా? అని నిలదీశారు.

Updated Date - May 10 , 2024 | 04:19 AM