Share News

Rajya Sabha elections: పెద్దలసభకు సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నిక

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:21 PM

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియాగాంధీతో పాటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు చున్నీలాల్ గారసియా, మదన్ రాథోడ్‌‌లు రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఎన్నికైనట్టు అసెంబ్లీ సెక్రటరీ మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు.

Rajya Sabha elections: పెద్దలసభకు సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నిక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్ (Rajasthan) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియాగాంధీతో పాటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు చున్నీలాల్ గారసియా, మదన్ రాథోడ్‌‌లు రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఎన్నికైనట్టు అసెంబ్లీ సెక్రటరీ మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసింది. పోటీలో ఇతర అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఈ ముగ్గురు నేతలు పోటీలేకుండానే ఏకగ్రీవంగా పెద్దలసభకు ఎన్నికయ్యారు.


దైవార్షిక ఎన్నికలు

షెడ్యూల్ ప్రకారం 56 రాజ్యసభ స్థానాలకు ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభమైంది. 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో 50 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనుండగా, ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3న ముగుస్తుంది.

Updated Date - Feb 20 , 2024 | 05:21 PM