Toilet Tax: హిమాచల్‌లో ‘టాయిలెట్ ట్యాక్స్’ దుమారం
ABN , Publish Date - Oct 05 , 2024 | 05:08 AM
హిమాచల్‌ప్రదేశ్‌లో ‘టాయిలెట్ సీట్ ట్కాక్స్’ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఇళ్లలో ఎన్ని టాయిలెట్లు ఉండే.. దానికి తగ్గట్టుగా ప్రతి దానికి రూ.25 పన్ను విధిస్తారన్న నోటిఫికేషన్‌పై రాజకీయ దుమారం రేగింది.
సిమ్లా, అక్టోబరు 4: హిమాచల్‌ప్రదేశ్‌లో ‘టాయిలెట్ సీట్ ట్కాక్స్’ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఇళ్లలో ఎన్ని టాయిలెట్లు ఉండే.. దానికి తగ్గట్టుగా ప్రతి దానికి రూ.25 పన్ను విధిస్తారన్న నోటిఫికేషన్‌పై రాజకీయ దుమారం రేగింది. ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది సిగ్గుమాలిన చర్య అని బీజేపీ మండిపడింది. ఈ నేపథ్యంలో సీఎం సుఖ్విందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ స్పందించింది. అలాంటి పన్ను విధించడం లేదని స్పష్టం చేసింది.
అది పాత నోటిఫికేషన్ అని, దాన్ని అదేరోజున ఉపసంహరించుకున్నామని తెలిపింది. ఈ వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రధాని మోదీ స్వచ్ఛతను ఒక ప్రజా ఉద్యమంలా చేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం ప్రజలకు టాయిలెట్ల పన్నులు వేస్తోంది. ఈ విధమైన చర్య దేశానికి అవమానకరం’ అన్నారు.