Share News

Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల 2024 కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..కాసేపట్లో

ABN , Publish Date - Jun 04 , 2024 | 06:34 AM

దేశప్రజల నిరీక్షణ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే(Lok Sabha Elections 2024) అందరి దృష్టి ఉంది. జూన్ 1న ముగిసిన లోక్‌సభలోని 543 స్థానాలకు 7 దశల్లో ఓటింగ్ పూర్తైంది.

Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల 2024 కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..కాసేపట్లో
Counting of votes for Lok Sabha Elections 2024

దేశప్రజల నిరీక్షణ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే(Lok Sabha Elections 2024) అందరి దృష్టి ఉంది. జూన్ 1న ముగిసిన లోక్‌సభలోని 543 స్థానాలకు 7 దశల్లో ఓటింగ్ పూర్తైంది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం (EC) ప్రకారం మొత్తం ఏడు దశల కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందన్నారు.


ఇప్పటికే అధికారులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కొన్ని చోట్ల కౌంటింగ్(Counting) కేంద్రాలకు చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం క్రమంగా పెరుగుతున్నారు. దీంతోపాటు పోలీసులు కూడా ఆయా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత ఇటివల ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ప్రధానంగా మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తుందని అంచనాలు వేశాయి. అయితే అవి కొన్నిసార్లు నిజం అవుతాయి. మరికొన్ని సార్లు విఫలమవుతాయి. మరోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని పేర్కొన్నారు. ఫలితాలు వీటికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయని కాంగ్రెస్ ఇండియా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


ఇది కూడా చదవండి:

EC : సార్వత్రిక పోరు..అభ్యర్థుల తీరు.. మొత్తం 8,360 మంది బరిలో

Enforcement Directorate (ED) : ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలు


Read Latest National News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 06:37 AM