Share News

Narayana: అమిత్‌షా సమావేశంపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 07 , 2024 | 01:11 PM

National: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ మోడల్‌ను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నలు ఆలోచించాలని.. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలతో కలిసి అన్నలు పోరాడాలని అన్నారు.

Narayana: అమిత్‌షా సమావేశంపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
CPI Leader Narayana

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: వామపక్ష తీవ్రవాదంపై కేంద్రమంత్రి అమిత్‌ షా (Union Minister Amit Shah) అధ్యక్షతన జరుగుతున్న సమావేశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దేశంలో రేప్‌లు, మర్డర్స్ జరుగుతున్నాయని ముందు వాటిపై ఫోకస్ పెట్టాలని హితవుపలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ మోడల్‌ను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నలు ఆలోచించాలని.. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలతో కలిసి అన్నలు పోరాడాలని అన్నారు. రేప్‌లు చేసే వాళ్లకు బెయిల్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేరా బాబాకు బెయిల్ ఇచ్చారని.. ఎన్నికలు వచ్చాయనే ఆయనకు బెయిల్ ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు.

AP NEWS: బీజేపీలోకి వైసీపీ ఎంపీలు .. కాశీ విశ్వనాథరాజు షాకింగ్ కామెంట్స్


ఘోరాతి ఘోరాలు చేసిన డేరా బాబాకు పంజాబ్, హర్యానా ఎన్నికల సమయంలో బెయిల్ ఇచ్చారన్నారు. వరవరరావు లాంటి వాళ్లకు మాత్రం బెయిల్ రాదని.. ఆయన మాత్రం బాంబేలోనే ఉండాలంటూ విరుచుకుపడ్డారు. జమ్ము కాశ్మీర్‌లో దొడ్డి దారిన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. జమ్ము కాశ్మీర్‌లో ఐదు మంది ఎమ్మెల్యేలను ముందే నామినేట్ చేశారన్నారు. రేపు ఓట్ల లెక్కింపు సమయంలో సీట్లు గెలవకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.


ప్రజల మద్దతు ఉంటే బీజేపీ ఇలా ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలన్నీ నిష్ప్రయోజనమన్నారు. బీహార్, మణిపూర్లలో ప్రధాని పర్యటించరని.. బీహార్‌లో వరదలు వచ్చి జనం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మణిపూర్ రావణ కష్టంలా కాలుతోందన్నారు. అయినప్పటికీ ప్రధాని చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బీహార్ వరదలను జాతీయ విపత్తుగా తక్షణం గుర్తించాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో సగం జిల్లాలు కరువు, సగం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోందన్నారు. నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడి ఇలాంటి విపత్తు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నేపాల్ దేశంతో మాట్లాడాలి బీహార్ ప్రజలను కాపాడాలని నారాయణ డిమాండ్ చేశారు.

Ponnam: ప్రతీ ఒక్కరు బీసీ సంక్షేమ గౌరవాన్ని కాపాడాలి


కాగా.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమీక్ష ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత ఈ సమావేశం జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, సీఎస్‌లు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, పలు కీలక శాఖల కార్యదర్శులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి అనిత హాజరయ్యారు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్ అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కారణమిదే

Viral: వామ్మో.. కోతి ముందు ‘జై శ్రీరామ్’ అంటే ఇలా జరుగుతుందా!? వైరల్ వీడియో

Read Latest National News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 01:17 PM