Share News

Supreme Court: ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు తగదు

ABN , Publish Date - Oct 04 , 2024 | 08:54 PM

ప్రజాస్వామ్య దేశాల్లో జర్నలిస్టుల భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుందని న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Supreme Court: ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు తగదు

న్యూఢిల్లీ: ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారంనాడు అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య దేశాల్లో జర్నలిస్టుల భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుందని న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Mallikarjun Kharge: నా గదిలోకే చొరబడతారా?.. రాజ్యసభ చైర్మన్‌కు ఖర్గే లేఖ


ప్రభుత్వ పాలనా విభాగంలో కులసమీకరణలకు సంబంధించిన కథనం రాసినందుకు తనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దానిని కొట్టివేయాలని కోరుతూ యూపీకి చెందిన ఉభిషేక్ ఉపాథ్యాయ్ అనే జర్నలిస్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు పంపింది. పిటిషనర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.


For Latest news and National news click here

ఇది కూడా చదవండి...

Minister: ‘ముడా’ వివాదంపై పెదవి విప్పిన మంత్రి.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Updated Date - Oct 04 , 2024 | 09:06 PM