Share News

Jammu and Kashmir: ఉగ్రవాదుల మెరుపు దాడిలో సీఆర్పీఎఫ్ అధికారి మృతి

ABN , Publish Date - Aug 19 , 2024 | 07:16 PM

జమ్మూ కశ్మీర్‌లో ఉదంపూర్ జిల్లాలోని దుడు ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మరణించారు. దుడు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను మరింతగా మోహరించేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో బెటాలియన్‌పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగి.. కాల్పులు జరిపారు.

Jammu and Kashmir: ఉగ్రవాదుల మెరుపు దాడిలో సీఆర్పీఎఫ్ అధికారి మృతి

శ్రీనగర్, ఆగస్ట్ 19: జమ్మూ కశ్మీర్‌లో ఉదంపూర్ జిల్లాలోని దుడు ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మరణించారు. దుడు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను మరింతగా మోహరించేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో బెటాలియన్‌పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగి.. కాల్పులు జరిపారు.

Also Read: రాఖీ పండుగ రోజు ఆకాశంలో అద్భుత.. భారత్‌లో కనిపించనున్న సూపర్‌ మూన్‌

Also Read: MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య


కొండ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ పోస్ట్ ఏర్పాటు..

దీంతో సీఆర్పీఎఫ్ అధికారి మరణించారు. జమ్మూలోని కొండ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు భారత సైన్యం శ్రీకారం చుట్టింది. ఆ ప్రదేశంలో సీఆర్పీఎఫ్ పోస్ట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాకాలు చేస్తుంది. అందులోభాగంగా సీఆర్పీఎఫ్ బెటాలియన్.. సోమవారం ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఉగ్రవాదులు.. సీఆర్పీఎఫ్‌ బృందంపై మెరుపు దాడికి దిగారు.

Also Read: Kolkata College student: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్ట్.. విద్యార్థి అరెస్ట్

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం

Also Read: దారుణం.. రాఖీ కట్టి ఊపిరి వదిలిన అక్క


జూన్ నుంచి పెరిగిన ఉగ్రదాడులు.. కాశ్మీర్ టైగర్స్ ప్రకటన..

మరోవైపు ఈ ఏడాది జూన్ నుంచి జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఈ దాడుల్లో పలువురు భారత సైన్యానికి చెందిన అధికారులే కాక.. జమ్మూ కశ్మీర్ పోలీసులు సైతం భారీ సంఖ్యలో మరణించారు. ఈ దాడులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన జై షే మహమ్మద్‌ జేబు సంస్థ కాశ్మీర్ టైగర్ ప్రకటించిన విషయం విధితమే. ఇక జులై 8వ తేదీ కతువా జిల్లాలో ఆర్మీ కాన్వాయిపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. అలాగే జులై 6వ తేదీ కుల్గాం జిల్లాలో రెండు వేర్వేరు ఉగ్రవాద దాడుల్లో ఆరుగురు తీవ్రవాదులు మృతి చెందగా, ఇద్దరు సైనికులు సైతం మృతి చెందారు.

Also Read: MUDA scam: సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం


అణిచివేతకు ప్రత్యేక చర్యలు..

రాష్ట్రంలో ఉగ్రవాద దాడులు మరింత పెరగడంతో.. వాటిని అణిచివేసేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా రాష్ట్రంలో ఉగ్రవాద దాడుల నిర్మూలనకు కఠిన చర్యలు అవలంభించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

JK Assembly polls 2024: మేనిఫెస్టో విడుదల చేసిన నేషనల్ కాన్ఫరెన్స్


మోగిన ఎన్నికల నగారా... అగ్రనేతల ఎన్నికల ప్రచారం..

మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. దీంతో బీజేపీ కీలక నేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే ఇండియా కూటమిలోని కీలక నేతలు రాహుల్, ప్రియాంక తదితరులు సైతం ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అలాంటి వేళ.. ఎక్కడ ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది.

Also Read: TGSRTC: బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

For Latest News and National News click here

Updated Date - Aug 19 , 2024 | 07:16 PM