Rain Alert: మళ్లీ వర్షాలంటా జాగ్రత్త.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
ABN , Publish Date - Oct 21 , 2024 | 08:39 PM
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుపానుగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే ఈ క్రమంలో ఏ ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఉందనేది ఇక్కడ చుద్దాం.
దేశంలో ఓ వైపు చలి క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో మరోవైపు తుపాను కూడా రాబోతుంది. అండమాన్ సముద్రం నుంచి ఉద్భవించిన తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకనుంది. దీనివల్ల అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు(rains) కురుస్తాయని ఐఎండీ(IMD) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే 'దానా' తుపాను ఏయే రాష్ట్రాల్లో కనిపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 22న పీడనంగా మారనంది.
ఈ రాష్ట్రాల్లో వర్షం హెచ్చరికలు
ఈ నేపథ్యంలో అక్టోబర్ 23 నాటికి బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను గరిష్ట ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ అక్టోబర్ 24-25 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో IMD ప్రకారం అక్టోబర్ 22 నుంచి 26 మధ్య ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 24న జార్ఖండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయి. తుపాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ వచ్చే వారం రోజుల్లో ఈశాన్య, మధ్య, వాయువ్య భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం లేదు.
మత్స్యకారులకు కూడా హెచ్చరికలు
ఈ క్రమంలోనే అక్టోబర్ 23న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారిన తర్వాత అక్టోబర్ 24న ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను తాకుతుందని ఐఎండీ తెలిపింది. దీనివల్ల సముద్రం మీదుగా గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో మత్స్యకారులు అక్టోబర్ 22-25 వరకు బీచ్‌ల దగ్గరకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.
గాలుల వేగం
ఈ కారణంగా అక్టోబరు 22న సాయంత్రం వరకు గంటకు 55-65 నుంచి 75 కి.మీ వేగంతో, అక్టోబర్ 23 సాయంత్రం నుంచి గంటకు 70-90 కి.మీ వేగంతో, అక్టోబరు 24 ఉదయం కూడా గాలులు వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అక్టోబర్ 23-24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45-55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ఈ క్రమంలోనే ఉత్తర బంగాళాఖాతంలో గాలుల వేగం గంటకు 100-110 నుంచి 120 కి.మీ వరకు పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 24న రాత్రి నుంచి అక్టోబర్ 25 ఉదయం వరకు గాలి వేగం గంటకు 120 కి.మీ.గా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..
Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా చెక్ చేసుకోండి..
Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
For Latest News and National News click here