Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్
ABN , Publish Date - Dec 17 , 2024 | 03:30 PM
ప్రియాంకతో పాటు విపక్ష ఎంపీలు సైతం పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు సభా ప్రాంగణం వెలుపల ప్లకార్డులు, బ్యాగులు పట్టుకుని పొరుగుదేశం (బంగ్లా)లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
న్యూఢిల్లీ: వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పార్లమెంటు ప్రాంగణంలో మరో కొత్త బ్యాగుతో అందరి దృష్టిని ఆకర్షించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ అమానుష దాడులకు వ్యతిరేకంగా 'పాలస్తీనా' బ్యాగుతో సోమవారంనాడు పార్లమెంటుకు వచ్చిన ప్రియాంక, మంగళవారం బంగ్లేదేశ్ రాతలున్న బ్యాగుతో కనిపించారు. బంగ్లాదేశ్ మైనారిటీలపై దాడులను ఖండిస్తున్న సందేశం ఆ బ్యాగుపై ఉంది. ప్రియాంకతో పాటు విపక్ష ఎంపీలు సైతం పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు సభా ప్రాంగణం వెలుపల ప్లకార్డులు, బ్యాగులు పట్టుకుని పొరుగుదేశం (బంగ్లా)లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
One Nation One Election Bills: జమిలి బిల్లులకు అనుకూలంగా 269 ఓట్లు
పార్లమెంటు శీతాకాల సమావేశాల ఆరంభం నుంచి విపక్షాలు అదానీ అంశంతో పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్నాయి. ఇందులో భాగంగా కొన్నిరోజులు ఆయా అంశాలపై ప్రతిపక్ష నేతలు వినూత్న తరహాలో నిరసనలు తెలుపుతున్నారు. అదానీ, మోదీ బంధాన్ని తెలుపుతున్న బ్యాగులతో ఒకసారి, ఆ ఇద్దరి మాస్క్‌లతో మరోసారి నిరసలు తెలిపారు. బీజేపీ నేతలకు గులాబీ పువ్వులు, త్రివర్ణ పతాకం అందిస్తూ సందడి చేశారు.
కాగా, ఒకరోజు పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా, ఒకరోజు బంగ్లా బ్యాగుతో ప్రియాంక నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. జాతీయ అంశాల కంటే అంతర్జాతీయ అంశాలపై ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నమేనంటూ బీజేపీ కొట్టిపారేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, హింసాకాండపై ఒక్కమాట కూడా మాట్లాడని ప్రియాంక తన పాలస్తీనా బ్యాగుతో ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇవ్వాలనుకుంటున్నట్టు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కాగా, దీనిపై ప్రియాకం సూటిగానే స్పందించారు. తాను ఏమి ధరించాలో, ఎలా ఉండాలో నిర్ణయించేదెవరని ప్రశ్నించారు.
Kasturi: గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు..
Ajit Doval: చైనా పర్యటనకు అజిత్ ఢోబాల్
For National News And Telugu News