LokSabha Elections: ఢిల్లీ వేదికగా కొత్త కుట్రకు తెర తీసిన బీజేపీ
ABN , Publish Date - May 22 , 2024 | 08:38 PM
ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త కుట్రకు తెర తీసిందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిశీ ఆరోపించారు. అందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత సృష్టించేందుకు మోదీ సర్కార్ పథక రచన చేసిందన్నారు.
న్యూఢిల్లీ, మే 22: ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త కుట్రకు తెర తీసిందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిశీ ఆరోపించారు. అందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత సృష్టించేందుకు మోదీ సర్కార్ పథక రచన చేసిందన్నారు.
Video Virul: పిన్నెల్లి ఎక్కడున్నా ఈడ్చుకొస్తారు ..!
ఆ క్రమంలో ఢిల్లీకి హర్యానా నుంచి మంచి నీటి సరఫరాను ఆపేసిందని ఆమె విమర్శించారు. బుధవారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మంత్రి అతిశీ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నగరా మోగిన నాటి నుంచి ఆప్‌ను దెబ్బ తీసే లక్ష్యంతో బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు.
LokSabha Elections: ఖాతాలు మూసి.. నగదు లాగేసుకుంటాయి
లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన అయిదు రోజులకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో కే్జ్రీవాల్ పాల్గొన కూడదనే బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని.. అదే సమయంలో తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ను బీజేపీ తెర తీసుకు వచ్చిందని అతిశీ మండిపడ్డారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశాల నుంచి భారీగా నిధులందాయంటూ.. పాత విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం బీజేపీ చేసిందని మండిపడ్డారు. అలాగే యమున నీటిని ఢిల్లీకి రాకుండా బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు.
Bangladesh: కోల్‌కతాలో ఎంపీ అదృశ్యం..!
అయితే మే 25వ తేదీ లోగా మరిన్నీ ఈ తరహా కుట్రలకు తెర తీసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని అతిశీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఢిల్లీ ఓటర్లను ఆమె సూచించారు. ఆప్‌ను దెబ్బ కొట్టేందుకు ఈ తరహా చర్యల ద్వారా ప్రజలను గందరగోళంలో పడేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని.. కానీ డిల్లీ ప్రజలు మాత్రం ఫుల్స్ కాదని అతిశీ ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
LokSabha Elections: సోరెన్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..!
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నీటి కొరత అధికంగా ఉందని.. ఈ నేపథ్యంలో వాటర్ బోర్డ్ విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయని మంత్రి అతిశీ గుర్తు చేశారు. ఈ నీటి కొరత అంశంపై హర్యానా ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ అంశంపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తామని అతిశీ చెప్పారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News