Share News

రాహుల్‌ హెలికాప్టర్‌ టేకాఫ్‌ 45 నిమిషాలు ఆలస్యం

ABN , Publish Date - Nov 16 , 2024 | 04:32 AM

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారంలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. రాహుల్‌గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వడంలో 45 నిమిషాలపాటు ఆలస్యం జరిగింది.

రాహుల్‌ హెలికాప్టర్‌ టేకాఫ్‌ 45 నిమిషాలు ఆలస్యం

  • ప్రధాని ఉన్నారనే ఇలా చేశారు.. ఈసీకి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

గొడ్డా, నవంబరు 15: ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారంలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. రాహుల్‌గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వడంలో 45 నిమిషాలపాటు ఆలస్యం జరిగింది. దీంతో ఆయన ఝార్ఖండ్‌లోని గొడ్డా నియోజకవర్గంలోనే ఉండిపోయారు. అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలోనే తమ నాయకుడి హెలికాప్టర్‌ను 45 నిమిషాల పాటు నిలుపుదల చేశారని, కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంపై ప్రభావం చూపించేలా వ్యవహరించారని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు. ‘‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) అధికారులకు ప్రధాని మోదీ కదలికలపై ఉన్న దృష్టి.. రాహుల్‌ గాంధీపై లేదు’’ అని దుయ్యబట్టారు. కాగా, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. కాగా, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ మాట్లాడుతూ.. బీసీలంటే బీజేపీకి లెక్కలేదని విమర్శలు గుప్పించారు. ‘‘ఝార్ఖండ్‌లో బీసీల రిజర్వేషన్‌ను 27 శాతం నుంచి 14 శాతానికి బీజేపీ తగ్గించింది’’ అని దుయ్యబట్టారు.

Updated Date - Nov 16 , 2024 | 04:32 AM