Share News

Delhi: సెప్టెంబరు నుంచి జనగణన?

ABN , Publish Date - Aug 22 , 2024 | 05:31 AM

ఆలస్యం అయిన దేశ జనాభా గణన సెప్టెంబరు నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. జనాభా గణన ఆలస్యంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.

Delhi: సెప్టెంబరు నుంచి జనగణన?

  • 2026 మార్చిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 21 : ఆలస్యం అయిన దేశ జనాభా గణన సెప్టెంబరు నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. జనాభా గణన ఆలస్యంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. దేశంలో పదేళ్లకోసారి నిర్వహించే ఈ కార్యక్రమం 2021లో పూర్తిచేయాల్సి ఉంది. కాని కోవిడ్‌ కారణంగా ఆలస్యం అయ్యింది.


వచ్చే నెలలో మొదలయ్యే ఈ కార్యక్రమం పూర్తిచేయడానికి 18 నెలలు పడుతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. జనాభా లెక్కలు ఆలస్యం అవడం వల్ల ఆర్థిక అంశాలు, ద్రవ్యోల్బణం, ఉద్యోగాల వంటి వాటి అంచనాపై ప్రభావం పడుతోందని ఆర్థికవేత్తలు వాపోతున్నారు. ప్రస్తుతం వీటి అంచనాకు, ప్రభుత్వ పథకాలవంటి వాటి కోసం 2011 జనాభా లెక్కలపైనే ఆధారపడవలసి వస్తోంది.


కాగా 15 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని నూతన జనాభా లెక్కల వివరాలను 2026 మార్చికి విడుదల చేయాలని జనాభా గణనను పర్యవేక్షించే హోం వ్యవహారాల శాఖ, గణాంక శాఖలు భావిస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రధాని కార్యాలయం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. గత ఏడాది విడుదల చేసిన ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ చైనాను అధిగమించింది.

Updated Date - Aug 22 , 2024 | 05:32 AM