Delhi : సీఏఏ పత్రాలపై ప్రభుత్వ వివరణ
ABN , Publish Date - Aug 10 , 2024 | 05:23 AM
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద జారీ చేసిన నిబంధనల పరిధిని కేంద్రం విస్తరించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద జారీ చేసిన నిబంధనల పరిధిని కేంద్రం విస్తరించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.
దరఖాస్తుదారుల తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతల్లో ఒకరు ఈ మూడు దేశాల్లో ఒకదాని పౌరుడని, లేదా ఆ దేశంలో నివసించారని రుజువు చేస్తూ భారత్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేక పాక్షిక న్యాయసంస్థలు జారీ చేసిన ఏదైనా డాక్యుమెంట్ ఉండొచ్చని కేంద్ర హోంశాఖ తాజాగా ప్రకటించింది.
దీనికి సంబంధించిన భూ రికార్డులు గానీ, న్యాయపరమైన ఉత్తర్వు తదితరాలను ఆమోదిస్తామని తెలిపింది.