Delhi : 60 కి.మీ. ఛేజింగ్ చేసి రియల్టీ కంపెనీ సీఈఓ అరెస్టు
ABN , Publish Date - Aug 06 , 2024 | 05:47 AM
ఢిల్లీ పోలీసులు 60 కి.మీ. మేర ఛేజింగ్ చేసి ఓ స్థిరాస్తి కంపెనీ సీఈఓను అరెస్టు చేశారు. పార్శ్వనాథ్ ల్యాండ్ మార్క్ డెవలపర్స్ కంపెనీకి డైరెక్టర్, సీఈఓగా వ్యవహరిస్తున్న సంజీవ్ జైన్‌పై రజత్ బబ్బర్ అనే వ్యక్తి 2017లో...
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఢిల్లీ పోలీసులు 60 కి.మీ. మేర ఛేజింగ్ చేసి ఓ స్థిరాస్తి కంపెనీ సీఈఓను అరెస్టు చేశారు. పార్శ్వనాథ్ ల్యాండ్ మార్క్ డెవలపర్స్ కంపెనీకి డైరెక్టర్, సీఈఓగా వ్యవహరిస్తున్న సంజీవ్ జైన్‌పై రజత్ బబ్బర్ అనే వ్యక్తి 2017లో ఇచ్చిన ఫిర్యాదుల మేరకు జాతీయ వినియోగదారుల ఫోరం ఆయనపై నాలుగు నాన్‌బెయల్‌బుల్ వారెంట్లు, ఒక బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.
ఈ కేసుల విచారణ నిమిత్తం హాజరు కాకపోవడంతో అరెస్టు చేయాలని ఫోరం ఆదేశించింది. గురుగ్రాంలోని డీఎల్‌ఎ్‌ఫ-2లో ఉన్న ఆయన నివాసానికి పోలీసులు వెళ్లగా ఆయన తప్పించుకొని ఇందిరాగాంధీ విమానాశ్రయం వైపు కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు 60 కి.మీ.మేర ఛేజింగ్ చేసి ఆయనను పట్టుకున్నారు.