Delhi: సీఎం కీలక నిర్ణయం.. 12 డీయూ కాలేజీలకు రూ.100 కోట్లు విడుదల
ABN , Publish Date - Oct 13 , 2024 | 07:09 PM
దేశ రాజధానిలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పునరుద్ధాటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ నిధులతో నడిచే డీయూ కాలేజీలకు రూ.100 కోట్ల నిధులను ఆదివారంనాడు విడుదల చేసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం పునరుద్ధాటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ నిధులతో నడిచే డీయూ కాలేజీలకు రూ.100 కోట్ల నిధులను ఆదివారంనాడు విడుదల చేసింది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో కాలేజీలకు రూ.400 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిపినట్టు తెలిపింది. తాజాగా విడుదల చేసన నిధులు మూడో క్వార్టర్ కోసం కేటాయించామని పేర్కొంది.
Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరో ముందు వాళ్లను తేల్చుకోనీయండి
అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం మొదట్నించీ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమత్రి అతిషి తెలిపారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏటేటా బడ్జెట్‌లో అత్యథిక మొత్తాన్ని విద్యారంగానికి కేటాయిస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న యూనివర్శిటీలను విస్తరించడంతో పాటు మూడో కొత్త యూనివర్శిటీలను తెరవడం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్‌పై ఢిల్లీ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ కాలేజీలకు నిధులను తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడు రెట్లు పెంచామని చెప్పారు. 2014-2015లో రూ.132 కోట్లు ఈ కాలేజీలకు కేటాయిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లకు పెంచామని తెలిపారు. ఆర్థిక నిర్వాహణలోపంతో నిలిచిపోయిన టీచర్ల సంక్షేమం, వారి వైద్య, పెన్షన్ ప్రయోజనాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించామని చెప్పారు.
Read More National News and Latest Telugu News
ఈ వార్తలు కూడా చదవండి:
Baba Siddique murder: దసరా బాణసంచా పేలుళ్ల మధ్య సిద్ధిఖిపై కాల్పులు
Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?