Delhi : బాలికల వివాహ వయసు 9 ఏళ్లే!
ABN , Publish Date - Aug 10 , 2024 | 05:29 AM
బాలికల కనీస వివాహ వయసును 9ఏళ్లకు, బాలురకు 15 ఏళ్లకు తగ్గించేందుకు ఇరాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పితృస్వామ్య కట్టుబాట్లతో నిండిన సమాజంలో ఇరాక్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత బిల్లు మహిళల హక్కులను కాలరాస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరాక్ పార్లమెంట్‌లో అనాగరిక బిల్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 9: బాలికల కనీస వివాహ వయసును 9ఏళ్లకు, బాలురకు 15 ఏళ్లకు తగ్గించేందుకు ఇరాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పితృస్వామ్య కట్టుబాట్లతో నిండిన సమాజంలో ఇరాక్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత బిల్లు మహిళల హక్కులను కాలరాస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అనాగరిక, వివాదాస్పద బిల్లుపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ప్రస్తుతం ఇరాక్‌లో బాలికల వివాహ వయసు 18 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుత బిల్లు పాస్ అయితే బాలికలు 9 ఏళ్లు, బాలురు 15 ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకులూ ఉండవు.
ఈ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ రయీద్ అలీ మాలికీకి స్వలింగ సంపర్కం, లింగమార్పిడి శస్త్రచికిత్సలను నేరంగా పరిగణించే వ్యభిచార వ్యతిరేక చట్టంతో సహా పలు వివాదాస్పద సవరణలను ప్రతిపాదించిన చరిత్ర ఉంది. ఇరాక్‌లో ఇప్పటికే 28శాతం మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోందని గణాంకాలు పేర్కొంటున్నాయి.