Delhi : ఉమ్మడి స్మృతి ఆమోదయోగ్యం కాదు: ఏఐఎంపీఎల్బీ
ABN , Publish Date - Aug 18 , 2024 | 03:58 AM
ఉమ్మడి పౌర స్మృతి కోసం జరిగే ప్రయత్నాలేవీ ఆమోదయోగ్యం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు శనివారం తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఉమ్మడి పౌర స్మృతి కోసం జరిగే ప్రయత్నాలేవీ ఆమోదయోగ్యం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు శనివారం తెలిపింది. మతపరమైన పర్సనల్ చట్టాలు బదులు లౌకికవాద పర్సనల్ చట్టాలు కావాలంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. పర్సనల్ లా చట్టాలను మతపరమైన చట్టాలుగా ప్రధాని పేర్కొనడంపై అభ్యంతరం తెలిపింది. పర్సనల్ లా విషయంలో ముస్లింలు ఎన్నటికీ రాజీపడబోరని పేర్కొంది. తీవ్రమైన పరిణామాలు కలిగించేందుకు జరుగుతున్న వ్యూహాత్మక కుట్రలో భాగంగానే ప్రధాని ఇలాంటి ప్రకటన చేశారని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ముస్లింల కుటుంబ చట్టాలు షరియా చట్టాలకు అనుగుణంగానే ఉంటాయని తెలిపింది.