Police Seize: స్నాక్స్ ప్యాకెట్ల చాటున డ్రగ్స్ సరఫరా.. రూ.2,000 కోట్ల విలువైన సరుకు పట్టివేత
ABN , Publish Date - Oct 11 , 2024 | 07:27 AM
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో స్పెషల్ టీం పోలీసుల గురువారం రాత్రి సుమారు రూ. 2000 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సరుకును స్నాక్స్ ప్యాకెట్లలో దాచి తీసుకెళ్తున్న క్రమంలో అడ్డంగా దొరికిపోయారు.
ఢిల్లీ(delhi) స్పెషల్ టీం పోలీసులు(police) గురువారం రాత్రి మరో భారీ విజయాన్ని సాధించారు. తనిఖీల్లో భాగంగా దాదాపు రూ. 2000 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకును దుండగులు స్నాక్స్ ప్యాకెట్లలో దాచి తీసుకెళ్లడం విశేషం. దీనిపై వీశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్ పోలీసులు జీపీఎస్ లొకేషన్‌ను ట్రాక్ చేసి సోదాలు చేశారు. ఆ క్రమంలో సమారు 200 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారం వ్యవధిలోనే రెండో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఇంతకు ముందు ఢిల్లీ పోలీసులు రూ. 5600 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.
పట్టించిన జీపీఎస్
ప్రస్తుతం పశ్చిమ ఢిల్లీలోని రమేష్ నగర్ ప్రాంతంలో దాడులు కొనసాగుతున్నాయి. అయితే కొకైన్‌ను రవాణా చేసే క్రమంలో వారు కారుకు జీపీఎస్ అమర్చడంతోనే డ్రగ్స్ విషయం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు జీపీఎస్ లొకేషన్‌ను ట్రాక్ చేసి తమ ఆపరేషన్‌ను నిర్వహించి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దేశ రాజధానికి కొకైన్ తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లండన్ పారిపోయాడు. దాదాపు రూ. 5600 కోట్ల విలువైన 560 కిలోలకు పైగా కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్న మునుపటి కేసులో ప్రమేయం ఉన్న సిండికేట్‌తో తాజా కేసు లింక్ ఉంది.
గతంలో
ఢిల్లీ రమేశ్ నగర్ ప్రాంతంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించిన చిన్న గోదాం నుంచి ఢిల్లీ పోలీసులు 200 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.2000 కోట్లు. దీనికి ముందు అక్టోబర్ 2న ఢిల్లీ పోలీసులు మహిపాల్‌పూర్ ప్రాంతంలోని గోదాముపై దాడి చేసి 567 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఔరంగజేబ్ సిద్ధిఖీ (23), హిమాన్షు కుమార్ (27), తుషార్ గోయల్ (40), భరత్ కుమార్ జైన్ (48) అనే నలుగురిని అక్కడికక్కడే అరెస్టు చేయగా, మరో ఇద్దరిని చెన్నై, అమృత్‌సర్‌లో అరెస్టు చేశారు. అఖ్లాక్ అనే మరో వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అంతకుముందు రోజు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర భారతదేశంలో డ్రగ్స్ సరఫరా చేయడంలో అఖ్లాక్ సహకరించేవాడని తెలుస్తోంది.
క్రిప్టో కరెన్సీలో
ఈ కేసుల్లో రూ. 5,620 కోట్ల విలువైన డ్రగ్స్ కార్టెల్‌లో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న భారత సంతతికి చెందిన దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త వీరేంద్ర బసోయాపై ఢిల్లీ పోలీసులు లుక్‌అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. వీరేంద్ర బసోయా లండన్ కేంద్రంగా డ్రగ్స్ సిండికేట్ నడుపుతున్నట్లు విచారణలో తేలింది. అతను డ్రగ్స్‌తో జిమ్మీతో సహా ఇద్దరిని పంపాడు. లండన్ నుంచి రమేష్ నగర్ ప్రాంతానికి డ్రగ్స్ తీసుకొచ్చి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. క్రిప్టో కరెన్సీ USDTలో డ్రగ్స్‌కు చెల్లింపు జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చెల్లింపు కోసం క్రిప్టో కరెన్సీ ఉపయోగించబడింది.
ఇవి కూడా చదవండి:
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Read More National News and Latest Telugu News