Share News

కులం వల్లే భారత సమాజంలో ఐక్యత: పాంచజన్య

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:45 AM

భారతీయ సమాజాన్ని కుల వ్యవస్థే సమైక్యంగా ఉంచుతోందని ఆర్‌ఎ్‌సఎ్‌సకు చెందిన ‘పాంచజన్య’ పత్రిక పేర్కొంది. మొగల్‌ పాలకులు దీనిని అర్థం చేసుకోలేదని.. బ్రిటిషర్లు మాత్రం కనిపెట్టి ‘విభజించి-పాలించు’ విధానంలో దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని తెలిపింది.

కులం వల్లే భారత సమాజంలో ఐక్యత: పాంచజన్య

న్యూఢిల్లీ, ఆగస్టు 11: భారతీయ సమాజాన్ని కుల వ్యవస్థే సమైక్యంగా ఉంచుతోందని ఆర్‌ఎ్‌సఎ్‌సకు చెందిన ‘పాంచజన్య’ పత్రిక పేర్కొంది. మొగల్‌ పాలకులు దీనిని అర్థం చేసుకోలేదని.. బ్రిటిషర్లు మాత్రం కనిపెట్టి ‘విభజించి-పాలించు’ విధానంలో దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని తెలిపింది.

పాంచజన్య పత్రిక సంపాదకుడు హితేశ్‌ శంకర్‌ ‘ఓ నేతా.. నీదే కులం!’ శీర్షికన ఆ పత్రికలో సంపాదకీయం రాశారు. కులగణన చేపట్టాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌పై మండిపడ్డారు. హిందువుల ఐక్యతను చీల్చేందుకు ఇది సాధనమని కాంగ్రెస్‌ అనుకుంటోందని విమర్శించారు. బ్రిటిషర్ల మాదిరిగానే ఆ పార్టీ కూడా లోక్‌సభ స్థానాలను కులాల ప్రాతిపదికన వ్యవస్థీకరించాలని.. దేశంలో చీలికలను మరింత పెంచాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు.

Updated Date - Aug 12 , 2024 | 03:48 AM