Share News

Delhi Special Police : ఢిల్లీలో ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాది అరెస్ట్‌

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:09 AM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఐఎ్‌సఐఎస్‌ ఉగ్రవాది దేశరాజధానిలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ నెల 8న రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని గంగాబక్ష్‌ మార్గ్‌ సమీపంలో ...

Delhi Special Police : ఢిల్లీలో ఐఎస్ఐఎస్‌  ఉగ్రవాది అరెస్ట్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 10: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఐఎ్‌సఐఎస్‌ ఉగ్రవాది దేశరాజధానిలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ నెల 8న రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని గంగాబక్ష్‌ మార్గ్‌ సమీపంలో సంచరిస్తున్న వాంటెడ్‌ ఉగ్రవాది రిజ్వాన్‌ అలీని ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఐఎస్ఐఎస్‌ పుణె మాడ్యూల్‌లో సభ్యుడైన ఢిల్లీలోని దర్యాగంజ్‌ ప్రాంతానికి చెందిన రిజ్వాన్‌ కొంతకాలంగా పరారీలో ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను అతనిపై ఎన్‌ఐఏ రూ.3లక్షల రివార్డు ప్రకటించింది.

Updated Date - Aug 11 , 2024 | 03:09 AM