Viral Video: ఏడో అంతస్తు నుంచి దూకి టీనేజ్ యువతి ఆత్మహత్య... సూసైడ్ నోట్‌లో ఏంచెప్పిందంటే
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:54 PM
పరీక్షల్లో ఫెయిలయితే ఆత్మహత్య చేసుకుంటానని గతంలో కూడా తన తల్లితో ఆ అమ్మాయి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, తల్లి హోమ్‌మేకర్ అని వారు వివరించారు.
న్యూఢిల్లీ: చదువులలో పెరుగుతున్న పోటీతత్వం, ఒత్తిళ్లు టీనేజ్ యువతీ యువకుల్లో ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. వ్యక్తిత్వ వికాసాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంచే చదువులు లోపించడం, తల్లిదండ్రులు సైతం పోటీ ప్రపంచం వైపు తమ పిల్లలను పరుగులు తీయిస్తుండటంతో టీనేజర్ల ఆత్మహత్యా ఘటనలు పునరావృతమవుతున్నాయి. అలాంటి తాజా ఘటనే ఢిల్లీలోని జామియా నగర్ ఏరియాలో చోటుచేసుకుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ (JEE)లో క్వాలిఫై కాకపోవడంతో నిరాశ చెందిన 17 ఏళ్ల యువతి ఏడంతస్తుల భవంతి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది.
Kulgam: ఆర్మీ వాహనం బోల్తాపడి సైనికుడి మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు
క్లాస్-12 పూర్తి చేసిన టీనేజర్ కొద్దికాలంగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ అవుతోందని, ఇటీవల జేఈఈ పరీక్షల్లో క్వాలిఫై కాకపోవడంతో నిరాశచెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 11.25 గంటలకు ఈ ఘటనకు చెందిన సమాచారం తమకు అందిందన్నారు. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ దొరినట్టు చెప్పారు. ''నన్ను మన్నించండి. జేఈఈ పరీక్షలను క్లియర్ చేయలేకపోయాను'' అని ఆ సూసైడ్ నోట్‌లో రాసి ఉంది.
కాగా, తాను పరీక్షల్లో ఫెయిలయితే ఆత్మహత్య చేసుకుంటానని గతంలో కూడా తన తల్లితో ఆ అమ్మాయి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, తల్లి హోమ్‌మేకర్ అని వారు వివరించారు. ఏడో అంతస్తు నుంచి టీనేజర్ కిందకు దూకిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 194 కింద కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రాహుల్‌కు గడ్డం గీస్తూ.. బార్బర్ ఎలా వణికాడో చూడండి..
Read More National News and Latest Telugu News