Share News

Delhi: భగ్గుమన్న గ్రూపు తగాదాలు.. కాల్పుల్లో ఒకరి మృతి

ABN , Publish Date - Oct 20 , 2024 | 09:22 PM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయిత్రం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జహంగీర్‌పురిలో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడ్డారు.

Delhi: భగ్గుమన్న గ్రూపు తగాదాలు.. కాల్పుల్లో ఒకరి మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయిత్రం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జహంగీర్‌పురిలో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడ్డారు. ఇరు గ్రూపుల మధ్య మాటామాటా పెరిగి కాల్పులకు దారితీసినట్టు చెబుతున్నారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తిని దీపక్ (35)గా గుర్తించారు.

Delhi Blast: పేలుడు ప్రాంతంలో పౌడర్ మిశ్రమం, వైర్‌లు


పోలీసుల కథనం ప్రకారం, 900 వాలీ గలిలోని పార్క్ సమీపంలో దీపక్ తన సోదరుడు, కొందరు మిత్రులతో కలిసి ఉండగా, నరేంద్ర, సూరజ్ అనే ఇద్దరు తమ గ్రూపుతో అక్కడికి చేరుకున్నారు. రెండు గ్రూపుల మధ్య మాటామాటా పెరిగి క్షణాల్లో హింసాత్మకంగా మారింది. పది రౌండ్లు వరకూ కాల్పులు జరిగాయి. దీపక్ మెడకు, కాలికి, వెనుకవైపు బుల్లెట్లు తగలడంతో హుటాహుటిన సమీపంలోని బీజేఆర్ఎం ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కాల్పుల ఘటనలో నరేంద్ర, సూరజ్‌ కూడా గాయపడటంతో ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఇరు గ్రూపుల మధ్య చిరకాల తగాదా వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నరేంద్ర, సూరజ్‌లను అరెస్టు చేసి, షూటింగ్‌ ఘటనతో ప్రమేయమున్న తక్కిన వారి కోసం గాలిస్తున్నారు. కాగా, జహంగీర్‌పురిలో గ్యాంగ్‌ల మధ్య హింసాత్మక ఘటనలు పెరుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Read More National News and Latest Telugu New

ఇది కూడా చదవండి..

Zeeshan Siddique: పోరాటం ముగియలేదు.. సింహం రక్తం నా నరనరాల్లో ఉంది

Updated Date - Oct 20 , 2024 | 09:23 PM