Share News

Deputy CM: తప్పు చేశాం.. సరిదిద్దుకుంటాం..

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:29 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన వాటి కంటే తక్కువ స్థానాలు దక్కడంపై ఆత్మ విమర్శ చేసుకుంటామని, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటామని కేపీసీసీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు.

Deputy CM: తప్పు చేశాం.. సరిదిద్దుకుంటాం..

- లోక్‌సభలో తక్కువ స్థానాలపై డీకే

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన వాటి కంటే తక్కువ స్థానాలు దక్కడంపై ఆత్మ విమర్శ చేసుకుంటామని, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటామని కేపీసీసీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర పార్టీ పరిశీలనా కమిటీ ముందు రాష్ట్రంలో ఓటమికి కారణాలపై విశ్లేషణ జరిగింది. ఢిల్లీ ప్రతినిధులుగా మధు సూదన్‌ మిస్త్రీ నేతృత్వంలో ఎంపీలు గౌరవ్‌గొగోయి, హిబి హిడన్‌ తదితరులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం డీకే శివకుమార్‌ కేపీసీసీ వద్ద మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలలో గతంలో కేవలం ఒకరు మాత్రమే ఎంపీ ఉండేవారని ప్రస్తుతం 9స్థానాలకు చేరామన్నారు. కనీసం 14-15 సీట్లు గెలుస్తామని భావించామని సాధ్యం కాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఉత్తమ అభ్యర్థులనే పోటీలో నిలిపామన్నారు అయితే ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారనేది పరిశీలించుకుంటామన్నారు.

ఇదికూడా చదవండి: Chennai: రన్‌వే పక్కనే గుడ్లు పెట్టిన పక్షి.. సోషల్‌ మీడియాలో వైరల్‌


గతం కంటే ఎనిమిది స్థానాలు అధికంగా వచ్చాయని సర్ది చెప్పుకోవడం లేదన్నారు. కేంద్ర కమిటీ ముందు అన్ని విషయాలు సమగ్రంగా చర్చించామన్నారు. భవిష్యత్తులో ఏవిధంగా మసలుకోవాలనేది ప్రణాళిక బద్దంగా నిర్ణయం తీసుకుంటామని వివరించామన్నారు. గ్యారెంటీ పథకాలకు ఎస్‌సీ, ఎస్‌టీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఇతర పథకాలకు వినియోగించారనే విషయమై జాతీయ ఎస్‌టీ కమిషన్‌ చీఫ్‌ సెక్రటరీకి నోటీసులు జారీ చేయడంపై స్పందిస్తూ దేశంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) తర్వాత కర్ణాటకలో మాత్రమే సబ్‌ప్లాన్‌ అమలు చేస్తున్నామన్నారు. జాతీయ కమిషన్‌ కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీయులకు బడ్జెట్‌లో కేటాయించిన విధంగానే నిధులు వినియోగిస్తున్నామన్నారు. నోటీసులు ఇచ్చేందుకు కమిషన్‌కు సిగ్గు ఉండాలన్నారు.


ఇదికూడా చదవండి: Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 12:29 PM