డేరా బాబాకు 20 రోజుల పాటు మళ్లీ పెరోల్
ABN , Publish Date - Oct 02 , 2024 | 03:45 AM
శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ మరోసారి పెరోల్‌పై విడుదల కానున్నారు.
చండీగఢ్, అక్టోబరు 1: శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ మరోసారి పెరోల్‌పై విడుదల కానున్నారు. 20 రోజుల పెరోల్ ఇవ్వాలన్న ఆయన వినతిని మంగళవారం రోహ్తక్ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ ఆమోదించారు. ఆయన బుధవారం రోహ్తక్లోని సునారియా జైలు నుంచి విడుదల కానున్నారు. హరియాణా ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో డేరాబాబా కారాగారం నుంచి బయటకు రానుండడం గమనార్హం. అయితే, ఆయన హరియాణాలో అడుగుపెట్టకూడదని ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. ప్రత్యక్షంగాగానీ, సామాజిక మాధ్యమాల రూపంలోగానీ ప్రచారం చేయకూడదని తెలిపింది.