Ayodhya Deepotsav: దీపోత్సవ్‌కు నన్ను ఆహ్వానించలేదు.. అయోధ్య ఎంపీ ఆవేదన
ABN , Publish Date - Oct 30 , 2024 | 04:21 PM
హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్య.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తుంది. అయోధ్యలోని భవ్య రామాలయం ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు దీపోత్సవ్‌ను ఘనంగా నిర్వహించనుంది.
లక్నో: సరికొత్త గిన్నెస్ రికార్డులే లక్ష్యంగా 'దీపోత్సవ్' (Deepotsav)కు అయోధ్య (Ayodhya) సిద్ధమవుతుండగా తనను మాత్రం ఈ ఈవెంట్‌కు ప్రభుత్వ యంత్రాంగం ఆహ్వానించ లేదని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ ప్రసాద్ (Awadesh Prasad) బుధవారంనాడు తెలిపారు. కలిసి చేసుకునే పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
Yogi Adityanath: ప్రభుత్వ ఉద్యోగులకు యోగి అదిరిపోయే గిఫ్ట్
''దీపావళికి సందర్భంగా అయోధ్య వాసుందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఎంపీగా గెలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. సోదరభావంతో అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ ఇది. ఇక్కడ కూడా రాజకీయాలు చేసి ప్రజలను విడగొట్టాలని బీజేపీ చూస్తోంది. నాకు ఒక పాసు కానీ, ఆహ్వానం కానీ పంపలేదు. ఈ పండుగ ఏ ఒక్క మతానికో చెందినది కాదు. నాకు పాసు ఇవ్వకపోయినా, ఆహ్వానించకపోయినా ఈరోజు నేను అయోధ్య వెళ్తున్నాను'' అని అవదేశ్ ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో జరిగి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌ను అవదేశ్ ప్రసాద్ ఓడించారు.
హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్య.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తుంది. అయోధ్యలోని భవ్య రామాలయం ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు దీపోత్సవ్‌ను ఘనంగా నిర్వహించనుంది. సరయూనది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా ఈ ఏడాది సరికొత్త గిన్నెస్ రికార్డును నెలకొల్పనుంది.
ఇవి కూడా చదవండి..
Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు
Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది
For National News And Telugu News...