Share News

Dinakaran: తేల్చిచెప్పేశారు.. ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదు..

ABN , Publish Date - Jun 13 , 2024 | 12:09 PM

అన్నాడీఎంకేలో ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ను విలీనం చేసే ప్రసక్తేలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌(TTV Dinakaran) స్పష్టం చేశారు. తంజావూరులో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీ(BJP) వ్యతిరేక పవనాలు లేవని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.

Dinakaran: తేల్చిచెప్పేశారు.. ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదు..

- టీటీవీ దినకరన్‌

చెన్నై: అన్నాడీఎంకేలో ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ను విలీనం చేసే ప్రసక్తేలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌(TTV Dinakaran) స్పష్టం చేశారు. తంజావూరులో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీ(BJP) వ్యతిరేక పవనాలు లేవని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. విక్రవాండి శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీ చేసే అభ్యర్థిని కూటమి పార్టీల నాయకులంతా కలిసి ఎంపిక చేస్తారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షాల నాయకులంతా విజయం కోసం తీవ్రంగా శ్రమించారని ఆయన కితాబునిచ్చారు.

ఇదికూడా చదవండి: Chennai: తీరంలో ‘అల’జడి.. సముద్రతీరప్రాంతాల్లో పెనుగాలులు


ఇదే స్ఫూర్తితో 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టిగా ప్రయత్నిస్తే ఎన్డీయే గెలుపు తథ్యమని, అధికారంలోకి వస్తుందని దినకరన్‌ జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పలు చోట్ల డిపాజిట్లు కూడా లోక్పోయిందని, ఈ దుస్థితికి ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నవారే కారణమని ఆరోపించారు. రెండాకుల గుర్తున్నా పార్టీని విజయం వైపు నడిపించలేకపోయారని ఎద్దేవా చేశారు. అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం ప్రారంభించి ఏడేళ్లు పూర్తయ్యిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేసే ప్రసక్తేలేదని దినకరన్‌ ప్రకటించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 12:38 PM