PM Narendra Modi: ప్రధాని మోదీకి డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్.. 50 ఏళ్ల నాటి సమస్యపై..
ABN , Publish Date - Mar 31 , 2024 | 05:44 PM
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 1974లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని, ఇది కీలక తప్పిదమని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలకు డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 1974లో ఇందిరా గాంధీ (Indira Gandhi) నేతృత్వంలోని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కచ్చతీవు (Katchatheevu) ద్వీపాన్ని శ్రీలంకకు (Sri Lanka) అప్పగించిందని, ఇది కీలక తప్పిదమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన ఆరోపణలకు డీఎంకే (DMK) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షాలపై నిందలు వేయడంలో బీజేపీ నిమగ్నమైందని చురకలంటించింది. ఈ పదేళ్ల కాలంలో తాను సాధించిన విజయాలపై ప్రచారం చేసేందుకు బీజేపీ భయపడుతోందని, అందుకే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడంపైనే దృష్టి సారించింది డీఎంకే ఎద్దేవా చేసింది.
Rahul Gandhi: ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారు
ఈమేరకు డీఎంకే అధికార ప్రతినిధి ఎస్ మనురాజ్ (S Manuraj) ఎక్స్ వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘‘దాదాపు 50 ఏళ్ల నాటి సమస్యపై తన ప్రభుత్వం అందించిన సమాచారం ఆధారంగా ఓ వార్తా కథనం ద్వారా ప్రధాని మోదీ కళ్లు తెరవడం నిజంగా ఆశ్చర్యకరం. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా.. బీజేపీ తన విజయాల గురించి ప్రచారం చేసేందుకు భయపడుతోంది. కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడంలోనే ఇప్పటికీ బిజీగా ఉంది’’ అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. కచ్చతీవు ద్వీపం వ్యవహారం దౌర్భాగ్యమే అయినా.. అది కాలం చెల్లిన రాజకీయ సమస్య అని పేర్కొన్నారు. 50 ఏళ్ల నాటి ఇష్యూ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన పరోక్ష అభిప్రాయాన్ని తన ట్వీట్ ద్వారా వ్యక్తపరిచారు.
Mamata Banerjee: బీజేపీకి మమతా బెనర్జీ సవాల్.. ఎన్నికల్లో 200 సీట్లు దాటితే..
కాగా.. కచ్చతీవు ద్వీపం ఇష్యూపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. కచ్చతీవు ద్వీపాన్ని ఎంత నిర్ద్వందంగా కాంగ్రెస్ వదులుకుందో కొత్త వాస్తవాలు వెల్లడిస్తున్నాయని.. ఇది ఇందిరాగాంధీ హయాంలో జరిగిన కీలక తప్పిదమని అన్నారు. ఇది ప్రతీ భారతీయుడికి కోపం తెప్పించే అంశమని.. కాంగ్రెస్‌ని ఎప్పటికీ విశ్వసించకూడదని ఈ అంశం పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. భారతదేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరచడమే కాంగ్రెస్ విధానమని ఓ వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ఆరోపించారు. ఇందుకు కౌంటర్‌గానే డీఎంకే పైవిధంగా రియాక్ట్ అయ్యింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి