Share News

Jammu and Kashmir: ఈ ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.5 లక్షల చొప్పున రివార్డు

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:50 PM

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జూన్ నుంచి పలు ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకోవడం, కొండప్రాంతం జిల్లాలో తిరిగి తీవ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న దుష్పపన్నాగాలపై జమ్మూకశ్మీర్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యాయి. టెర్రరిజంపై కొరడా ఝుళిపిస్తూ ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను శనివారంనాడు విడుదల చేశారు. వీరి ఆచూకి చెప్పిన వారికి రూ.5 లక్షల చొప్పున రివార్డును ప్రకటించారు.

Jammu and Kashmir: ఈ ముగ్గురు ఉగ్రవాదుల  ఆచూకీ చెబితే రూ.5 లక్షల చొప్పున రివార్డు

శ్రీనగర్: జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో జూన్ నుంచి పలు ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకోవడం, కొండప్రాంతం జిల్లాలో తిరిగి తీవ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న దుష్పపన్నాగాలపై జమ్మూకశ్మీర్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యాయి. టెర్రరిజంపై కొరడా ఝుళిపిస్తూ ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను శనివారంనాడు విడుదల చేశారు. వీరి ఆచూకి చెప్పిన వారికి రూ.5 లక్షల చొప్పున రివార్డును ప్రకటించారు. ఈ ఉగ్రవాదులు దోడా, దెస్సా ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో సంచరిస్తూ ఇటీవల దెస్సాలోని ఉరర్ బగి ప్రాంతంలో జరిగిన ఉగ్రఘటనల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.


సమాచారం ఇలా ఇవ్వండి...

ముగ్గురు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం తెలిస్తే ప్రజలు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని జమ్మూకశ్మీర్ పోలీసులు (దోడా జిల్లా) కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్లను కూడా పోలీసులు ప్రకటించారు.

-ఎస్ఎస్‌పి దోడా-9541904201

-ఎస్‌పీ హెచ్‌క్యూఆర్ఎస్ దోడా-9797649362, 9541904202

-ఎస్‌పీ ఓపీఎస్ దోడా-9541904203

-డీవైఎస్‌పీ డర్ దోడా-9541904205

-డీవై.ఎస్‌పీ హెచ్‌క్యూఆర్ఎస్ దోడా-9541904207

-ఎస్‌హెచ్‌ఓ పీఎస్ దోడా-808238906

-ఐసీ పీపీ బగ్లా భారత్ - 7051484314,9541904249

-పీసీఆర్ దోడా-01996233530, 7298923100, 9469365174,9103317361

Encounter: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ సైనికుడు మృతి, మరో నలుగురికి గాయాలు..


పాక్ కుట్ర భగ్నం.. సైనికుడి మృతి

కాగా, జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కమ్‌కారీ సెక్టార్‌లో పాకిస్థాన్ 'బోర్డర్ యాక్షన్ టీమ్' (BAT) జరిపిన దాడిని భారత సైన్యం శనివారం భగ్నం చేసింది. ఇదే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు వీరమరణం చెందగా, కెప్టెన్‌తో సహా మరో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. పాకిస్థాన్ చొరబాటుదారుని భారత బలగాలు మట్టుబెట్టాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 03:50 PM