Arvind Kejriwal: మోదీ పేరు తలిస్తే మీ భర్తకు ఫుడ్ పెట్టొద్దు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 10 , 2024 | 11:50 AM
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) మోదీ(modi) పేరు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీ భర్తలు మోదీ పేరు తలిస్తే వారికి రాత్రి పూట భోజనం పెట్టొద్దని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) మోదీ(modi) పేరు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీ భర్తలు మోదీ పేరు తలిస్తే వారికి రాత్రి పూట భోజనం పెట్టొద్దని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం ఢిల్లీలోని సివిక్ సెంటర్‌లో జరిగిన మహిళా సన్మాన కార్యక్రమంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో మహిళా సమ్మాన్ యోజన ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టౌన్‌హాల్ సెషన్‌లో ఢిల్లీలోని మహిళా ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ స్కీం ద్వారా ఢిల్లీలోని మహిళా ఓటర్లకు నెలకు రూ.1000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అధిక సంఖ్యలో ఓటు వేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు.
మహిళలకు కరెంటు, నీరు, విద్య, వైద్యం, బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి అనేక సౌకర్యాలు ఇస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు మీ భర్తలు, సోదరులు, తండ్రులు సహా మీ కుటుంబంలోని వారితో కేజ్రీవాల్‌కు ఓటేస్తామని ప్రతిజ్ఞ చేయించాలని మహిళలను అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కోరారు. మీ ప్రయోజనాల కోసం పని చేసే వ్యక్తికి ఓటు వేయమని ఒప్పించడం మీ బాధ్యత అని అన్నారు. అంతేకాదు ఒకవేళ మీ భర్త మోదీ పేరు తలిస్తే అవసరమైతే రాత్రి వారికి ఫుడ్ కట్ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ రెండూ ఢిల్లీలో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఢిల్లీ(delhi)లో 7 సీట్ల కోసం ఈ పోరు కొనసాగుతోంది.
మరోవైపు మహిళలకు వెయ్యి రూపాయలు ఇచ్చే పథకం మహిళలను నాశనం చేస్తుందని బీజేపీ(BJP) అంటుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ప్రతి మహిళకు రూ.1000 ఇస్తూ డబ్బును వృథా చేస్తున్నారని అంటున్నారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే బీజేపీ ప్రభుత్వం అనేక మందికి భారీ రుణాలను మాఫీ చేసి ప్రజల సొమ్మును వృథా చేయడం తప్పు కాదా అని సీఎం ప్రశ్నించారు.
మహిళలకు సాధికారత కల్పిస్తామని అన్ని పార్టీలు చెబుతున్నాయని, సాధికారత పేరుతో ఆయా పార్టీకి చెందిన ఒక మహిళకు సాయం చేసి మహిళా సాధికారత సాధించామని చెప్పుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. కానీ కేవలం ఇద్దరు-నలుగురు మహిళలు మాత్రమే దీని వల్ల ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. దీని వల్ల మిగిలిన మహిళలకు(Womens) ఏమీ లభించడం లేదని వెల్లడించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Sri Rama Navami: శ్రీరామ నవమికి తొలిసారిగా హాలిడే ప్రకటించిన సీఎం..ఎన్నికల కోసమేనా?