DRDO: డీఆర్డీవో మరో ఘనత.. అభ్యాస్ ట్రయల్స్ విజయవంతం
ABN , Publish Date - Jun 28 , 2024 | 03:56 PM
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్‌తో హై-స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (HEAT) 'అభ్యాస్' డెవలప్‌మెంటల్ ట్రయల్స్‌ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది.
ఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్‌తో హై-స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (HEAT) 'అభ్యాస్' డెవలప్‌మెంటల్ ట్రయల్స్‌ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది.
ఒడిశా రాష్ట్రం చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)లో ఈ ట్రయల్స్ జరిగాయి. తాజా ట్రయల్‌తో ABHYAS మొత్తంగా 10 డెవలప్‌మెంటల్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించినట్టైంది. పరీక్షలో, ఈ విమానం సర్వైలెన్స్ టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో సహా వివిధ ట్రాకింగ్ సెన్సార్‌లను పరిశీలించారు. ఇది అందుబాటులోకి వస్తే భారత సాయుధ దళాల అవసరాలను తీరుస్తుంది.
అభ్యాస్ ప్రత్యేకతలు..
ఎయిర్ వెహికల్‌ని ట్విన్ అండర్-స్లంగ్ బూస్టర్‌ల నుండి ప్రారంభించారు. వాటి బూస్టర్‌లు సబ్‌సోనిక్ వేగంతో ప్రయాణించడంలో సహాయపడ్డాయి. ఈ ప్రక్రియ సెకనుకు 180 మీటర్ల వేగంతో జరుగుతుంది. అంటే ఒక సెకనులో అంత దూరాన్ని కవర్ చేస్తుందన్నమాట. దీన్ని ల్యాప్‌టాప్‌తో నియంత్రిస్తారు. ఇది గరిష్టంగా 5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. కాబట్టి క్షిపణులను పరీక్షించవచ్చు.ఇది యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్ ప్రాక్టీస్, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు, జామర్ ప్లాట్‌ఫారమ్, డికాయ్, పోస్ట్ లాంచ్ రికవరీ మోడ్ వంటి మిషన్‌లలో ఉపయోగపడుతుంది. అభ్యాస్‌ను బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, ప్రొడక్షన్ ఏజెన్సీలు, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, లార్సెన్ అండ్ టర్బో సంస్థలు అభివృద్ధి చేశాయి. ఎగురుతున్న సమయంలో డేటాను కూడా రికార్డు చేసే ఫీచర్ ఇందులో ఉంది.
బూస్టర్‌ను అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ, నావిగేషన్ సిస్టమ్‌ను రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రూపొందించారు. గుర్తింపు పొందిన ఏజెన్సీలతో, అభ్యాస్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది.'అభ్యాస్' ట్రయల్స్ విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. డీఆర్డీవో, సాయుధ దళాలను అభినందించారు.
For Latest News and Tech News click here..