Share News

వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆస్తమా

ABN , Publish Date - Oct 29 , 2024 | 04:27 AM

వాయు కాలుష్యం కారణంగా పిల్లలు, పెద్దల్లో ఆస్త్మా వ్యాధి పెరుగుతున్నట్టు ప్రపంచస్థాయి అధ్యయనంలో వెల్లడయింది.

వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆస్తమా

న్యూఢిల్లీ, అక్టోబరు 28: వాయు కాలుష్యం కారణంగా పిల్లలు, పెద్దల్లో ఆస్త్మా వ్యాధి పెరుగుతున్నట్టు ప్రపంచస్థాయి అధ్యయనంలో వెల్లడయింది. 2019-23 మధ్య 22 దేశాల్లో 68 చోట్ల జరిపిన అధ్యయనంలో ఈ విషయం రుజువయింది. మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. దీనిపై విశ్లేషించిన శాస్త్రవేత్త రూయిజింగ్‌ నీ ‘వన్‌ ఎర్త్‌’ మ్యాగజైన్‌లో వ్యాసం రాశారు. వాయు కాలుష్యాన్ని ‘ఫైన్‌ పర్టిక్యులర్‌ మ్యాటర్‌ (పీఎం 2.5)గా లెక్కిస్తారు. గాలిలో కాలుష్యకారక సూక్ష్మ రేణువులు ఎన్ని ఉన్నాయన్నది దీని ద్వారా తెలుస్తుంది. ప్రతి ఘనపు మీటరు గాలిలో 10 మైక్రోగ్రాముల మేర పీఎం2.5 పెరిగితే ఆస్త్మా వచ్చే ముప్పు 21% మేర అధికమవుతుందని అధ్యయనంలో తేలింది.

Updated Date - Oct 29 , 2024 | 04:27 AM