Share News

Jharkhand Elections: ఎన్నికల వేళ ఈసీఐ సంచలన నిర్ణయం.. డీజీపీ తొలగింపునకు ఆదేశం

ABN , Publish Date - Oct 19 , 2024 | 06:05 PM

అనురాగ్ గుప్తా స్థానంలో కొత్త డీజీపీ నియామకానికి వీలుగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారుల జాబితాను అక్టోబర్ 21వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా జార్ఖాండ్ ప్రభుత్వాన్ని ఈసీఐ ఆదేశించింది.

Jharkhand Elections: ఎన్నికల వేళ ఈసీఐ సంచలన నిర్ణయం.. డీజీపీ తొలగింపునకు ఆదేశం

న్యూఢిల్లీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Elections) వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. జార్ఖాండ్ యాక్టింగ్ డీజీపీ (DGP) అనురాగ్ గుప్తా (Anurag Gupta)ను తక్షణం తొలగించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యాక్టింగ్ డీజీపీ తన బాధ్యతలను అదే క్యాడర్‌లోని సీనియర్ మోస్ట్ డీజీపీ అధికారికి అప్పగించాలని శనివారంనాడు స్పష్టం చేసింది. గత ఎన్నికల సమయంలో అనురాగ్ గుప్తాపై వచ్చిన ఫిర్యాదులు, ఆయనపై తీసుకున్న చర్యలు ఆధారంగా ఈసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అనురాగ్ గుప్తా స్థానంలో కొత్త డీజీపీ నియామకానికి వీలుగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారుల జాబితాను అక్టోబర్ 21వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా జార్ఖాండ్ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Vijaya Rahatkar: జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా విజయా రహాట్కర్


కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పక్షపాత వైఖరితో వ్యవహరించారంటూ జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఫిర్యాదు చేయడంతో జార్ఖాండ్ ఏడీజీ (స్పెషల్ బ్రాంచ్) బాధ్యతల నుంచి గుప్తాను తొలగించారు. తిరిగి ఢిల్లీకి రీఅస్సైన్ చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేందుకు రాష్ట్రానికి తిరిగి రాకుండా ఆంక్షలు విధించారు. జార్ఖాండ్‌లో 2016లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ గుప్తా అడిషనల్ డీజీపీగా అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీనిపై ఈసీ దర్యాప్తు నేపథ్యంలో గుప్తాకు ఛార్జిషీటు జారీ చేసి డిపార్ట్‌మెంట్ ఎంక్వయిరీ జరిపారు.


జార్ఖాండ్‌లో ప్రస్తుతం జేఎంఎం ఏకైక పెద్ద పార్టీగా అధికారంలో ఉంది. 30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండగా, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు-2024 షెడ్యూల్‌ను ఈసీఐ ఇటీవల ప్రకటించింది. ఆ ప్రకారం రెండు విడతలుగా నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం కింద రూ. 15 లక్షల సాయం

Updated Date - Oct 19 , 2024 | 06:05 PM