Share News

ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం: ఈసీ

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:46 AM

ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మరోసారి స్పష్టం చేసింది.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం: ఈసీ

న్యూఢిల్లీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని పేర్కొంది. ఈవీఎంను హ్యాక్‌.. ట్యాంపరింగ్‌ చేయగలనంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందని, దీనిపై కఠినంగా వ్యవరిస్తామని వెల్లడించింది. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంలను హ్యాక్‌ చేయడం గురించి చెప్పినట్లు తెలుస్తోందని స్పష్టంచేసింది. నిందితుడిని సయ్యద్‌ షుజాగా గుర్తించామని, ఇతడిపై మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈవో) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వివరించింది. 2019లోనూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షుజాపై ఢిల్లీలోనూ కేసు నమోదైనట్లు ఈసీ గుర్తుచేసింది.

Updated Date - Dec 02 , 2024 | 03:46 AM