SandeshKhali: సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ను అరెస్టు చేసిన ఈడీ
ABN , Publish Date - Mar 30 , 2024 | 08:20 PM
పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ లో భూ ఆక్రమణల కేసులో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారంనాడు అరెస్టు చేసింది. నిందితుడు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali)లో భూ ఆక్రమణల (Land grabbing) కేసులో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ (Sheikh Shahjahan)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారంనాడు అరెస్టు చేసింది. నిందితుడు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. బసీర్‌హట్ జైలులో షేక్ హాజహాన్‌ను ఈడీ ఇంటరాగేషన్ చేసింది. దీనికి ముందు ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.
కాగా, ప్రొడక్షన్ వారెంట్‌పై షేక్ హాజహాన్‌ను జైలు అధికారులు కోర్టు ముందు సోమవారం హాజరుపరచనున్నారు. ఈ సమయంలోనే ఆయనను రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా కోర్టును ఈడీ కోరుతుంది. అప్పటి వరకూ ఆయన జైలులోనే కొనసాగుతారు. సందేశ్‌ఖాలిలో మహిళల వేధింపులు, భూ ఆక్రమణల వ్యవహారం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడైన షేక్ షాజహాన్ అప్పట్నించి పరారీలో ఉండటం, అతని ఇంట్లో తనిఖీల కోసం వెళ్లిన ఈడీ అధికారులపై ఆయన అనుచరులు దాడి చేయడం దుమారం రేపింది. అధికార పార్టీనే ఆయనకు రక్షణ కల్పిస్తోందని బీజేపీ విమర్శలకు దిగగా, సందేశ్‌ఖాలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో తక్షణం ఆయనను అరెస్టు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడతో ఎట్టకేలకు షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.