Eknath Shinde: సీఎం ఎవరో తేలేది అప్పుడే.. సస్పెన్స్‌కు షిండే తెర
ABN , Publish Date - Dec 01 , 2024 | 05:26 PM
పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికే తాను బేషరతుగా మద్దతు ప్రకటించారని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. గత 2.5 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం పనితీరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ వచ్చన్నారు. ఆ కారణంగానే ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని చెప్పారు.
ముంబై: మహాయుతి ప్రభుత్వంలో శాఖల కేటాయింపుపై తాను మనస్తాపం చెందినట్టు వస్తు్న్న వార్తలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) పెదవి విప్పారు. బీజేపీకి బేషరతుగా తన మద్దతు ఉంటుందని, తాను ఎలాంటి మనస్తాపానికి గురికాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి పేరును బీజేపీ సోమవారంనాడు నిర్ణయిస్తుందని చెప్పారు.
Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన
తీవ్ర జ్వరంతో సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో ఉన్న షిండే మీడియాతో మాట్లాడుతూ, తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని, క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. తీరికలేని ఎన్నికల ప్రచారం కారణంగా కొద్దిపాటి విశ్రాంతికోసం ఇక్కడకు వచ్చానని అన్నారు. 2.5 ఏళ్లుగా సీఎంగా తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు. తనను కలుసుకునేందుకు ఇక్కడకు కూడా జనం వస్తున్నారని, దీంతో కొంత అస్వస్థతకు గురయ్యానని తెలిపారు.
మా మధ్య మంచి అవగాహన ఉంది
మహాయుతి కూటమిలోని మూడు పార్టీల మధ్య మధ్య అవగాహన ఉందని, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సోమవారంనాడు నిర్ణయం తీసుకుంటారని షిండే చెప్పారు. పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికే తాను బేషరతుగా మద్దతు ప్రకటించారని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. గత 2.5 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం పనితీరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ వచ్చన్నారు. ఆ కారణంగానే ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని చెప్పారు.
శ్రీకాంత్ షిండేపై..
షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్ షిండే సీఎం కావచ్చంటూ వస్తున్న ఊహాగానాలపై అడిగినప్పుడు, చర్చలు జరుగుతున్నాయని ఆయన సమాధానమిచ్చారు. గత వారం ఢిల్లీలో అమిత్‌షాతో ఒక సమావేశం జరిగిందని, ఇప్పుడు కూటమి భాగస్వామ్యులు కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరుపుతారని అన్నారు. బీజేపీ ఇంతవరకూ లెజిస్లేచర్ పార్టీ నేతను ప్రకటించ లేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తామంతా పనిచేస్తామని, ఎవరి మధ్యా విభేదాలు లేవని చెప్పారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు ఉంటాయన, పదేపదే తన వైఖరిని స్పష్టం చేయాల్సిన పనిలేదని వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Fire Accident: 61 మంది భక్తులతో వెళ్తున్న బస్సుకు భారీ అగ్ని ప్రమాదం.. చివరకు..
Heavy Raind: చెన్నై నగరాన్ని ముంచెత్తిన ‘ఫెంగల్’..
Read More National News and Latest Telugu News