Share News

Shrikant Shinde: ఉప ముఖ్యమంత్రి పదవిపై షిండే తనయుడు క్లారిటీ

ABN , Publish Date - Dec 02 , 2024 | 02:49 PM

లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవికి తనకు అవకాశం వచ్చిందని, పార్టీ ఆర్గనైజేషన్ కోసం పనిచేసే ఆలోచనతో మంత్రి పదవిని నిరాకరించానని శ్రీకాంత్ షిండే తెలిపారు. ప్రభుత్వంలో పొజిషన్ కావాలనే కోరిక తనకు లేదన్నారు.

Shrikant Shinde: ఉప ముఖ్యమంత్రి పదవిపై షిండే తనయుడు క్లారిటీ

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్నట్టు వస్తున్న ఊహాగానాలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే (Shrikant Shinde) తొలిసారి స్పందించారు. తనకు అలాంటి కోరికేమీ లేదని, మంత్రివర్గంలో ఏ పదవికి తాను రేసులో లేనని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో జరుగుతున్న జప్యంపై వివరణ ఇస్తూ, దీనిపై చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయని ఒక ట్వీట్‌లో తెలిపారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం: ఈసీ


''ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రెండ్రోజులు తన గ్రామానికి వెళ్లారు. అస్వస్థత కారణంగా విశ్రాంతి తీసుకున్నారు. దీంతో వదంతులు వ్యాప్తి చెందాయి. నేను ఉప ముఖ్యమంత్రి కావచ్చంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదు. పూర్తిగా ఇవి నిరాధారమైన వార్తలు'' అని శ్రీకాంత్ షిండే తెలిపారు.


కేంద్రంలో పదవి ఇస్తామన్నా..

లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవికి తనకు అవకాశం వచ్చిందని, పార్టీ ఆర్గనైజేషన్ కోసం పనిచేసే ఆలోచనతో మంత్రి పదవిని నిరాకరించానని శ్రీకాంత్ షిండే తెలిపారు. ప్రభుత్వంలో పొజిషన్ కావాలనే కోరిక తనకు లేదన్నారు. రాష్ట్రంలోనూ ఎలాంటి మంత్రి పదవిని ఆశించడం లేదని స్పష్టం చేశారు. కేవలం తన లోక్‌సభ నియోజకవర్గం కోసం, శివసేన కోసం తాను పనిచేస్తానని చెప్పారు. మహారాష్ట్రలోని కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గానికి శ్రీకాంత్ షిండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


ఇది కూడా చదవండి

Farmers Protest Impact: రైతుల నిరసన ఎఫెక్ట్.. ఎక్స్‌ప్రెస్‌వేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Cyclone Fengal Impact: ఫెంగల్ తుపాను కారణంగా 19 మంది మృతి.. ఎక్కడెక్కడంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 02 , 2024 | 02:49 PM