New Delhi: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. పెన్షన్ రూల్‌లో మార్పు..
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:57 PM
ఉద్యోగ విరమణ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. పెన్షన్‌కు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేసే అంశంపై కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. తమ పెన్షన్ సమస్యలకు సంబంధించిన..
న్యూఢిల్లీ, నవంబర్ 18: ఉద్యోగ విరమణ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. పెన్షన్‌కు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేసే అంశంపై కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. తమ పెన్షన్ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించింది. భవిష్య/ e-HRMS ద్వారా ఫారమ్ 6-A ని సమర్పించాలని తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ కొత్త ఫారమ్ 6-A నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి అంటే 16-11-2024 నుంచి 120 తరువాత అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
కొత్త ఫారమ్ 6-A.. భవిష్య/e-HRMS 2.0లో చేర్చడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే.. 06.11.2024 నుండి పదవీ విరమణ పొందనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఇక నుంచి పదవీ విరమణ చేయనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. భవిష్య లేదా e- HRMS 2.0లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా ప్రత్యేకంగా కొత్త సింగిల్ పెన్షన్ దరఖాస్తు ఫారమ్ 6-Aని పూరించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. కొత్త ఫారమ్ 6A తొమ్మిది వేర్వేరు రూపాలను ఒక రూపంలోకి మిళితం చేస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన వారికి ఈ ప్రక్రియ మరింత ఈజీగా ఉంటుందని, సమర్థవంతంగా పని చేస్తుందని కేంద్రమంత్రి చెప్పారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్&పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించి ఈ భవిష్య. ఇది అన్ని పదవీ విరమణ బకాయిలను చెల్లించడం, పదవీ విరమణ రోజునే రిటైర్ అవుతున్న ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్(పీపీఓ) డెలివరీ చేయడం వంటి లక్ష్యంతో భవిష్య ప్రోగ్రామ్‌ని ప్రారంభించారు. ఈ వ్యవస్థలో పెన్షన్ మంజూరు, చెల్లింపు ప్రక్రియను ఆన్‌లైన్ ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. పరిపాలనా అధికారులు పెన్షన్, ఇతర పదవీ విరమనణ ప్రయోజనాలను మంజూరు చేయడానికి సహాయపడుతుంది. అలాగే, పదవీ విరమణ తరువాత నెలవారీ పింఛన్ చెల్లింపు కోసం ఉపకరిస్తుంది. లబ్ధిదారులు ePPOని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇక eHRMSను ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌గా పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులతో సహా అన్ని వివరాలు ఉంటాయి. ఫారమ్ సరళీకరణ అనేది కేంద్రం ప్రభుత్వ ‘గరిష్ట పాలన-కనిష్ట ప్రభుత్వం’ విధానంలో ఒక ముఖ్యమైనది.
Also Read:
దేశంలో అతిపెద్ద బ్యాంక్ నుంచి కస్టమర్లకు షాక్.. పెరిగిన రేట్లు
ఏపీలో వెలుగులోకి.. మరో భారీ కుంభకోణం
ఏం క్రియేటివిటీ బాసూ.. ట్రైన్ కింద నుంచి కార్లు, పై నుంచి లారీలు..
For More National News and Telugu News..