Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: సైనికుడు మృతి
ABN , Publish Date - Jul 06 , 2024 | 06:36 PM
జమ్మూ కశ్మీర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు మృతి చెందాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని మోడర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి.
శ్రీనగర్, జులై 06: జమ్మూ కశ్మీర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు మృతి చెందాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని మోడర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో భద్రతా దళాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఆ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ సైనికుడు మరణించాడు.
అయితే ఈ ఎదురు కాల్పుల్లో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయని.. దీంతో అతడు మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు భద్రతా దళాలతో కలిసి కాశ్మీర్ జోన్ పోలీసులు ఈ ఎదురు కాల్పులు జరుపుతున్నారు. దీంతో ఎన్‌కౌంటర్ కొనసాగుతుంది. ఈ మేరకు కాశ్మీర్ జోన్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గత కొద్ది నెలలుగా జమ్మూ కశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి.
Also Read: Hathras stampede: భోలే బాబా అనుచరుడిపై ప్రశ్నల వర్షం
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ.. జమ్మూకశ్మీర్‌లో దాడులకు ఉగ్రవాదులు తెగబడుతున్నారు. ఆ క్రమంలో జూన్ 9వ తేదీన రియాసీ జిల్లాలో శివఖేడ్ నుంచి కాట్రాకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు వేగాన్ని డ్రైవర్ పెంచారు. దాంతో బస్సు లోయలో పడిపోయింది.
Also Read: KCR: రోజా ఇంట్లో చేపల పులుసు తిని..
ఈ ప్రమాదంలో 10 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 33 మంది గాయపడ్డారు. ఇక సరిగ్గా అదే సమయంలో న్యూఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షన ఇటీవల న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదుల అణిచివేతకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులను ఈ సందర్భంగా అమిత్ షా అదేశించిన విషయం విధితమే.
Also Read: Tamil Nadu: ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. స్పందించిన మాయావతి
అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఆగస్ట్ 19వ తేదీ తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ కీలక నేతలతో శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమై.. ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతో అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలో మరిన్నీ ఉగ్రవాద దాడులు జరిగే అవకాశముందని భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: Rohit: కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో టూర్లు..
అందులోభాగంగా రాష్ట్రంలో మరిన్ని భద్రతా దళాలను మోహరించేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇంకోవైపు ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో.. జమ్మూ కశ్మీర్‌పై ప్రపంచం దృష్టి సారించింది. అలాగే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను అన్నీ రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులో భాగంగా ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అవి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
For Latest News and National News click here