Share News

Ration Scam: ఈడీ అధికారులపై స్థానికుల దాడి.. ఎందుకంటే?

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:29 PM

తమ నేతను తీసుకెళ్తున్నారన్న కోపంతో ఓ గ్రామస్థులు ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన పశ్చిమబెంగాల్ లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ 24 పరగణాల జిల్లాకి చెందిన టీఎంసీ(TMC) నాయకుడు షాజహాన్ షేక్(రేషన్ కుంభకోణం)(Ration Scam) విచారణనిమిత్తం ఈడీ అధికారులు గ్రామానికి వచ్చారు. అనంతరం ఆయన్ని ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని కోరుతూ.. తమ కారులో తీసుకెళ్లారు.

Ration Scam: ఈడీ అధికారులపై స్థానికుల దాడి.. ఎందుకంటే?

కోల్ కతా: తమ నేతను తీసుకెళ్తున్నారన్న కోపంతో ఓ గ్రామస్థులు ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన పశ్చిమబెంగాల్ లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ 24 పరగణాల జిల్లాకి చెందిన టీఎంసీ(TMC) నాయకుడు షాజహాన్ షేక్(రేషన్ కుంభకోణం)(Ration Scam) విచారణనిమిత్తం ఈడీ అధికారులు గ్రామానికి వచ్చారు. అనంతరం ఆయన్ని ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని కోరుతూ.. తమ కారులో తీసుకెళ్లారు. తమ నేతను ఎలా తీసుకెళ్తారంటూ 200 మందికిపైగా స్థానికులు ఒక్కసారిగా ఈడీ అధికారుల కార్లను చుట్టు ముట్టారు.

వారిలో కొందరు కార్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఈడీ అధికారులతోపాటు, కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయనడానికి ఈ ఘటన మంచి ఉదాహరణ అని బీజేపీ నేత సువేందు అధికారి విమర్శించారు. లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించాలని కోరారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని అన్నారు.


రేషన్ స్కాం అంటే..

రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దాడులు నెలల తరబడి కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో లబ్ధిదారుల కోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) రేషన్‌లో దాదాపు 30 శాతం బహిరంగ మార్కెట్‌కు అక్రమంగా మళ్లించారని ఈడీ గతంలో వెల్లడించింది.

రైతుల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి పలువురు రైస్‌ మిల్లర్లు, కోఆపరేటివ్‌ సొసైటీలు ప్రభుత్వ మద్దతు ధరను రైతులకు ఇవ్వకుండా వారే తీసుకుంటున్నారని ఈడీ ఆరోపించింది. ఇదే వివాదంలో గతేడాది అక్టోబర్‌ 14న రైస్‌ మిల్లు యజమాని రహ్మాన్‌ను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదే కేసులో ప్రమేయం కలిగిన టీఎంసీ నేతను విచారించడానికి ఈడీ ఆయన గ్రామానికి వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 05 , 2024 | 12:31 PM