Maharashtra: ఇక్బాల్‌కి కీలక పోస్టింగ్: విమర్శలకు దిగిన ప్రతిపక్షం
ABN , Publish Date - Aug 23 , 2024 | 08:08 PM
మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి సైతం ఎన్నికల నగారా మోగనుంది. అలాంటి వేళ.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ చాహల్‌ను అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్)గా ప్రభుత్వం నియమించింది.
ముంబయి, ఆగస్ట్ 23: ఇప్పటికే జమ్మూ కశ్మీర్, హరియాణ అసెంబ్లీలకు ఎన్నికల నగారా మోగింది. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి సైతం ఎన్నికల నగారా మోగనుంది. అలాంటి వేళ.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ చాహల్‌ను అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్)గా ప్రభుత్వం నియమించింది.
Also Read: ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఈ నిర్ణయంపై ప్రతిపక్షం శివసేన (యూబీటీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ దుబే శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. షిండే ప్రభుత్వం ద్వంద్వ విధానాలకు తెర తీసిందంటూ ఆయన మండిపడ్డారు. ముంబయి మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ హయాంలోఆయనపై బీజేపీ అవినీతి ఆరోపణలు గుప్పించిందని గుర్తు చేశారు.
Also Read: Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
Also Read: Uttar Pradesh: 40 మంది విద్యార్థులకు గాయాలు.. అయిదుగురి పరిస్థితి విషమం
రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్య పక్షాలే అధికారంలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాంటిది ఆయన్ని ఈ పదవిలో ఎలా నియమిస్తారని ఆనంద్ దుబే ప్రశ్నించారు. గతంలో కోవిడ్ కుంభకోణం, ఫర్నీచర్ కుంభకోణంలో ఆయన్ని ఈడీ విచారణ ఎదుర్కొన్నారని.. ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలు ఆరోపించారన్నారు.
Also Read: Palnadu: మాచర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ
Also Read: RG Kar Medical Hospital: వైద్యురాలి హత్యాచారం వేళ.. సీఎం మమత లేఖ వైరల్
Also Read: kolkata RG Kar Hospital: కపిల్ సిబల్‌కు బెంగాల్ కాంగ్రెస్ పార్టీ నేత కీలక సూచన
గతంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని సైతం బీజేపీ తన పార్టీలో చేరుకుంటుందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. కోవిడ్, ఫర్నీచర్ కుంభకోణం కేసుల్లో పలుమార్లు ఇక్బాల్ సింగ్‌ను ఈడీ ప్రశ్నించింది. అలాగే ఆయనపై పలు కేసులు సైతం నమోదు చేసింది. ఇవే కేసుల్లో మహా వికాస్ అఘాడీ నేతలను కూడా ఈడీ ప్రశ్నించిన విషయం విధితమే.
ఇంకోవైపు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆ క్రమంలో తొలుత జమ్మూ కశ్మీర్, హరియాణ అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్‌ను మరికొద్ది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశముందని సమాచారం.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..