Share News

Express trains: ఏడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు

ABN , Publish Date - Jun 21 , 2024 | 10:52 AM

ఏడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు జరిగినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) తెలిపింది. - కర్ణాటక రాష్ట్రం యశ్వంత్‌పూర్‌-చెన్నై సెంట్రల్‌ రాత్రి 10.45 గంటల రైలు శుక్రవారం సెంట్రల్‌కు బదులుగా చెన్నై బీచ్‌ రైల్వేస్టేషన్‌ వరకే వస్తుంది.

Express trains: ఏడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు

చెన్నై: ఏడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు జరిగినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) తెలిపింది.

- కర్ణాటక రాష్ట్రం యశ్వంత్‌పూర్‌-చెన్నై సెంట్రల్‌ రాత్రి 10.45 గంటల రైలు శుక్రవారం సెంట్రల్‌కు బదులుగా చెన్నై బీచ్‌ రైల్వేస్టేషన్‌ వరకే వస్తుంది.

- కోయంబత్తూర్‌-సెంట్రల్‌ రాత్రి 11.30 గంటల రైలు సెంట్రల్‌కు బదులుగా శుక్రవారం బీచ్‌ స్టేషన్‌కు చేరుతుంది.

- కేరళ రాష్ట్రం అలెప్పి-సెంట్రల్‌ మధ్యాహ్నం 3.20 గంటల రైలు 25వ తేది వరకు ఆవడి వరకు మాత్రమే నడుస్తుంది.

- కోయంబత్తూర్‌-సెంట్రల్‌ మధ్యాహ్నం 3.15 గంటల రైలు 26వ తేది వరకు పెరంబూర్‌ వరకు మాత్రమే నడువనుంది.

ఇదికూడా చదవండి: Manda Krishnamadiga: మాదిగలకు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది..


- ఆంధ్ర రాష్ట్రం సాయి బి స్టేషన్‌-చెన్నై రాత్రి 7 గంటల రైలు సెంట్రల్‌కు బదులుగా శనివారం చెన్నై బీచ్‌ స్టేషన్‌కు వస్తుంది.

- కేఎస్ఆర్‌ బెంగుళూరు- బిహార్‌ రాష్ట్రం ధానాపూర్‌ ఉదయం 7.50 గంటల రైలు 24వ తేది పెరంబూర్‌ వచ్చి తిరిగి వెళ్లనుంది.

- సెంట్రల్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు 26వ తేది ఉదయం 7 గంటలకు బదులుగా 1 గంట 45 నిముషాలు ఆలస్యంగా 8.45 గంటలకు బయల్దేరనుంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 10:52 AM