National: ఆర్మీ చీఫ్ పాండే పదవీ కాలం పొడిగింపు
ABN , Publish Date - May 27 , 2024 | 02:54 AM
భారత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. మనోజ్ పాండే పదవీ కాలం మే 31తో ముగియనుంది.
జూన్ 30 వరకు పొడిగిస్తూ..
కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం
న్యూఢిల్లీ, మే 26: భారత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. మనోజ్ పాండే పదవీ కాలం మే 31తో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఆర్మీ రూల్స్ 16ఏ(4) ప్రకారం నెల రోజుల పాటు పదవీ కాలాన్ని పొడిగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గతంలోనూ అరుదైన సందర్భంల్లో ఆర్మీ చీఫ్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. దేశంలో మొదటి సారిగా 1970లో నాటి సైన్యాధిపతి జీజీ బేవూర్ పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటు ప్రధాని ఇందిరాగాంధీ పొడిగించారు. తద్వారా సీనియారిటీ ప్రకారం ఆర్మీ చీఫ్ కావాల్సిన ప్రేమ్ భగత్ బాధ్యతలు స్వీకరించకుండానే పదవీ విరమణ చేశారు. ప్రస్తుత సైన్యాధిపతి మనోజ్ పాండే తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైన్యాదిపతి బరిలో ఉన్నారు.