ఢిల్లీలో తండ్రి, నలుగురు కూతుళ్ల ఆత్మహత్య!
ABN , Publish Date - Sep 29 , 2024 | 04:19 AM
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఘోరం జరిగింది. ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఘోరం జరిగింది. ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో లోపలి నుంచి తలుపులు బిగించుకొని 48 ఏళ్ల ఇంటి పెద్ద, ఆయన నలుగురు కూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. నలుగురి కూతుళ్లు 15-25 ఏళ్ల మధ్య వయస్కులు. నలుగురూ మానసిక వికలాంగులే! ఈ అమ్మాయిల తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. శుక్రవారం వాళ్ల ఫ్లాట్‌లోంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి నలుగురి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. 3-4 రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతదేహాల పక్కన పురుగుల మందు డబ్బా, జ్యూస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ కనిపించాయి.