Share News

Lok Sabha Elections 2024: సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలిపై ఎఫ్ఐఆర్

ABN , Publish Date - Apr 30 , 2024 | 08:07 PM

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు, సమాజ్‌వాదీ పార్టీ నేత మారియా ఆలం ఖాన్ ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. మతం పేరుతో ఆమె ఓట్ల అడగడంపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Lok Sabha Elections 2024:  సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలిపై ఎఫ్ఐఆర్

ఫరూఖాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid) మేనకోడలు (Niece), సమాజ్‌వాదీ పార్టీ (SP) నేత మారియా ఆలం ఖాన్ (Maria Alam Khan) ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. మతం పేరుతో ఆమె ఓట్ల అడగడంపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే 'ఓట్ జీహాద్' తప్పనిసరి అని ఫరూఖాబాద్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. మారియా ప్రసంగం వీడియా సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్ కావడంతో బీజేపీ వెంటనే స్పందించింది. ర్యాడికలిజాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నారని మండిపడింది.

Lok Sabha Elections: 'ప్రేమ దుకాణం'లో నకిలీ వీడియోల అమ్మకం.. కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు


ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుఠ్ తరఫున తిరుగుతున్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరిపై కూడా మారియా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అనుచిత ప్రవర్తనకు తప్పనిసరిగా శిక్ష పడుతుందన్నారు. ''అందరూ కలిసికట్టుగా ఉందాం. అంతా నిశబ్దంగా, సామూహికంగా ఓటు వేయాలి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఓట్ల జీహాద్ ఒక్కటే మార్గం'' అని ఆమె పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్‌సీకి సంబంధించి కేసులపైన, జైళ్లలో ఉన్న వారిని విడుదల చేసేందుకు సల్మాన్ ఖుర్షీద్ పోరాడుతున్నారని కూడా చెప్పారు. కాగా, ఎఫ్ఐఆర్‌లో సల్మాన్ ఖుర్షీద్ పేరు కూడా చేర్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 08:10 PM