Mithun Chakraborty: మిథున్ చక్రవర్తిపై ఎఫ్ఐఆర్
ABN , Publish Date - Nov 06 , 2024 | 05:35 PM
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 27న సాల్ట్ లేక్ ఏరియాలోని ఈస్ట్రన్ జోనల్ కల్చరల్ సెంటర్‌లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ, 2026లో పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం కానుందని, లక్ష్యసాధనకు ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు.
కోల్‌కతా: బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)పై కోల్‌కతా పోలీసులు బుధవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పశ్చిమబెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలలో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.
Jammu and Kashmir: 370 అధికరణ పునరుద్ధరణపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 27న సాల్ట్ లేక్ ఏరియాలోని ఈస్ట్రన్ జోనల్ కల్చరల్ సెంటర్‌లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ, 2026లో పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం కానుందని, లక్ష్యసాధనకు ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలను ఓటు వేయకుండా ఎవరూ భయపెట్టలేరని అన్నారు. మిథున్ రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఫిర్యాదు అందడంతో బిదాన్‌నగర్ సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రతీకార రాజకీయాలు: బీజేపీ
మిథున్ చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఖండిచారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే కేసు పెట్టారని అన్నారు. మిథున్ ఎక్కడా రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని, పోలీసులను రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుని ఆయనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ఇవి కూాడా చదవండి
PM Modi: నా బెస్ట్ ఫ్రెండ్‌కు విషెస్..మోదీ ట్వీట్
Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. 40 ఏళ్లకిందటే మంత్రిగా పనిచేశా
For More National and telugu News